S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కుండపోత వర్షం.. అతలాకుతలం

పరకాల, సెప్టెంబర్ 24: అకాశానికి చిల్లు పడిందా అన్న తరహాలో 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షానికి పరకాల నిలువెల్లా తడిసి ముద్దయింది. గురువారం వరుణుడి జోరు మొదలైంది. శుక్రవారం సాయంత్రం నుండి ప్రారంభమైన వర్షం శనివారం సాయంత్రం వరకు కొనసాగడంతో పరకాల పట్టణం ఆతలకుతలమైంది. పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయినాయి. ఇంట్లోకి నీరు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడారు. పట్టణంలో రెండు ఇండ్లు కూలి పోయినట్లు వివిధ పార్టీల నేతలు తెలిపారు. పరకాల పట్టణంలోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరి కొద్ది రోజలు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
బిఎస్‌ఎన్‌ఎల్ టవర్‌పై పిడుగు
బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ సమీపంలో పిడుగు పడి టవర్ సామాగ్రి కాలి పోయింది. శనివారం సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని బిఎస్‌ఎన్‌ఎల్ టవర్‌పై పిడుగు పడి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి పోయినట్లు స్థానికులు తెలిపారు.
చట్టుపక్కల ఇండ్లలో విద్యుత్ మీటర్లు, టీవిలు, ఫ్యాన్లు కాలి పోయినట్లు వారు పేర్కొన్నారు.