బ్రహ్మాండ నాయకుడు బాబా
Published Sunday, 25 September 2016గురుసాయిబాబా ఇంటర్నేషనల్ పతాకంపై మిలింద్ గునాజీ సాయిబాబాగా నటించిన చిత్రం ‘బ్రహ్మాండ నాయక్ సాయిబాబా’. సత్యప్రకాష్ దూబె దర్శకత్వంలో నార్సింగ్ ఎం.షిండే, సత్యప్రకాష్ దూబె తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్యప్రకాష్ దూబె మాట్లాడుతూ, శ్రీ షిరిడీ సాయిబాబా మహిమల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం సాయిబాబా మీద భక్తితో రూపొందించానని, ప్రస్తుత యువతరానికి ఆయన మహిమలను తెలియజేయడమే ఈ చిత్రంలో ప్రధాన ఇతివృత్తమని ఆయన అన్నారు.