ముక్కోణపు ప్రేమలో డాన్
Published Sunday, 25 September 2016సుబ్బు కథానాయకుడిగా అభి సుబ్రహ్మణ్యం క్రియేషన్స్ పతాకంపై శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో శివపురం సురేంద్రకుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘రజని ద డాన్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఏ సంబంధం లేని హీరోకి అనుకోకుండా ఓ బంధం ఏర్పడితే అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. ఆ పరిణామాలు ఎలా సాగాయి అన్న కథనంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా సాగే ఈ చిత్రంలో 5 పాటలు ఉంటాయని, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్‌లోనే సినిమా పూర్తిచేస్తామని, వైజాగ్, బెంగుళూర్, కొడైకెనాల్‌లలో షూటింగ్ చేస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శాండి, నిర్మాత: శివపురం సురేంద్రకుమార్, దర్శకత్వం: శ్రీకృష్ణ గొర్లె.