తరుణ్ లవ్‌స్టోరీ
Published Sunday, 25 September 2016తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలుపుతూ లడక్, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని, మూడు పాత్రలలో తరుణ్ నటన ఈ చిత్రానికి ప్రాణంగా నిలుస్తుందని అన్నారు. లవర్ బాయ్‌గా తరుణ్‌కు ఉన్న ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా ఓ అందమైన ప్రేమకథను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించామని అన్నారు. ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ప్రతి పాట ఆణిముత్యంలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశామని, త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, ఓ అందమైన ప్రేమకథను చూశామన్న సంతృప్తి ప్రేక్షకులకు కలిగించాలన్న మంచి ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించామని ఆయన అన్నారు.