S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఏలూరు, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల సంక్షేమానికి 2015-16 సంవత్సరంలో 31 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి 11 వేల మందికి లబ్ధిచేకూర్చిందని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ ఐ వై ఆర్ కృష్ణారావు చెప్పారు. స్థానిక శనివారపుపేట శ్రీరామ్‌నగర్‌లోని శ్రీశ్రీ విద్యాసంస్థల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ అవగాహనా సదస్సులో కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. గత సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లాలో 1288 మంది లబ్ధిదారులకు 3.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ఈ సంవత్సరం ఇంత వరకూ రాష్ట్రంలో 13 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 12 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చగా అందులో పశ్చిమగోదావరి జిల్లాకు 1.22 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా 1300 మంది పేద బ్రాహ్మణులను ఆదుకున్నామన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన పేద బ్రాహ్మణ లబ్ధిదారులు వారు పొందే రుణాలను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద బ్రాహ్మణులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పేద బ్రాహ్మణులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తామన్నారు. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటుచేసి అందులో సభ్యత్వం పొందిన వారికి వారికి నచ్చిన చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. మొదటిగా ప్రతీ ఒక్కరికీ 25 వేల రూపాయల రుణం అందిస్తామని వారికి నచ్చిన వ్యాపారం చేసుకుని సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి ఇంకా ఎక్కువ రుణాలు అందించి వారిని ఆదుకుంటామన్నారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారం, కేటగరింగ్, పూజా సామాగ్రి, టైలరింగ్, అగరవత్తులు, దేవుని సాహిత్యం పుస్తకాలు, జంజ్యాలు, దీక్షా వస్త్రాలు, ఫాల్స్ విక్రయాలు, జాకెట్ ముక్కల విక్రయాలు, చీరల అమ్మకం తదితర వ్యాపారాలుచేసుకునే కొంత మంది మహిళా గ్రూపులకు ఒక్కొక్క గ్రూపునకు 25 వేల రూపాయలు చొప్పున రుణ చెక్కులను కృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ సి ఇవో అభిషిక్త్ జయంత్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్, బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్, శ్రీశ్రీ విద్యాసంస్థల అధినేత ఎంబి ఎస్ శర్మ, అధ్యక్షులు ఎస్ పేరుశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రూపుల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ గ్రూపులు ఉత్పత్తుల ప్రదర్శన స్టాల్స్‌ను కృష్ణారావు సందర్శించారు. ఈ ప్రదర్శనలో అరుంధతీ గ్రూపు, స్ర్తి శక్తి సంఘాల గ్రూపుల వారు ఏర్పాటుచేసిన వివిధ ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకం స్టాల్స్‌ను కృష్ణారావు పరిశీలించారు.