S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లక్ష్య సాధన వైపు గురిపెడితే విజయం ఖాయం

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 25: యువత అపజయాలను లెక్కచేయకుండా లక్ష్య సాధన వైపు గురిపెడితే ఎప్పటికైనా విజయం వరిస్తుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్స్ రజత పతక విజేత పివి సింధు అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం ఆమె కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన సింధూకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆమె తన తల్లిదండ్రులు పివి రమణ, విజయ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకొన్నారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆమెకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, వేదాశీస్సులు అందజేశారు. అనంతరం ఆలయ ఇవో వేండ్ర త్రినాధరావు సింధుకు చిన వెంకన్న చిత్ర పటాన్ని, పట్టువస్త్రాలను, ప్రసాదాన్ని అందజేశారు. దర్శనానంతరం బయటకు వచ్చిన ఆమెతో ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వర్షం కురవడంతో గొడుగు సహాయంతో ఆమె ఆలయం నుండి బయటకు వచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఒలంపిక్స్‌కు వెళ్లే ముందు చిన వెంకన్నకు మొక్కుకున్నానని, దానిని తీర్చుకునేందుకే ఇప్పుడు వచ్చానన్నారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, కోచ్ ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం తనకు మంచి ప్రోత్సాహమిచ్చిందన్నారు. ఒలంపిక్స్ క్రీడల్లో గెలుపోటములు ఎలా ఉన్నా అసలు ఆ క్రీడల్లో పాల్గొనడమే గొప్పవరమని ఆమె పేర్కొన్నారు. ఓడిన వారికి సైతం ఏదో ఒక రోజు గెలుపు ఉంటుందని, నిరుత్సాహపడకుండా కార్యసాధన చేస్తే ఎంతో సాధించవచ్చునన్నారు. ద్వారకాతిరుమలలో దర్శనం బాగా జరిగిందని, మళ్లీమళ్లీ తాను ఇక్కడకు వస్తానని అన్నారు. కార్యక్రమంలో ఏలూరు డిఎస్పీ జి వెంకటేశ్వరరావు, భీమడోలు సిఐ ఎం వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.