S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు ‘శ్రీకారం

విజయనగరం(పూల్‌బాగ్),సెప్టెంబర్ 25: వైభవంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు ఆదివారం పందిరి రాటతో శ్రీకారం చుట్టారు. చదురుగుడి ప్రాంగణంలో ఉదయం తొమ్మిది గంటలకు, వనంగుడి ప్రాంగణంలో ఉదయం పది గంటలకు మేళతాళాలతో, వేదమంత్రాల నడుమ పందిరిరాటను వేశారు. ఈసందర్భంగా వేకువజామున అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి పలురకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు.పందిరిరాటకు ముందు వినాయకపూజ, భూమి పూజలను నిర్వహించారు. అనంతరం పసుపు-కుంకుమలు రాసిన పందిరిరాటను ఆలయ ప్రాంగణంలో నిలిపారు. పందిరిరాట కార్యక్రమంలో జెడ్పీచైర్ పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి మాట్లాడుతూ పైడితల్లి సిరిమాను ఉత్సవం తిలకించేందుకు రాష్ట్ర,రాష్ట్రేతర ప్రాంతాల నుండి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారని, వారికి ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు అధికారులు తీసుకోవాలన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి భానురాజా మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలకు అన్ని పనులు పందిరిరాట వేయడంతో ప్రారంభిస్తున్నామని అన్నారు. అక్టోబర్ 17న తొలేళ్లు, అక్టోబర్ 18న సిరిమాను సంబరం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో శాసనసభ్యురాలు మీసాల గీత, బిజెపి నాయకుడు భవిరెడ్డి శివప్రసాదరెడ్డి మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ఎస్ అచ్చిరెడ్డి, ఆలయ ప్రధానపూజారి తాళ్లపూడి భాస్కరరావు, వేదపండితులు శంభర శంకరం, తాతారాజేష్, ఆలయ సూపరిండెంట్ సత్యనారాయణ, రామారావు, రమణమూర్తి ఆలయసిబ్బంది పాల్గొన్నారు.