S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జలడిగ్బంధం!

చోడవరం, సెప్టెంబర్ 25: అల్పపీడనం ప్రభావంతో శనివారం అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది. పట్టణంలో అనేక కాలనీలు నీటమునిగాయి. అర్ధరాత్రి 12గంటల నుండి మూడు గంటల వరకు వర్షం బీభత్సం సృష్టించింది. ద్వారకానగర్, రెల్లికాలనీ, బాలాజీనగర్, చైత్రానగర్, కోఆపరేటీవ్ కాలనీ, బానయ్య కోనేరు, దుడ్డు వీధి, గోవిందమ్మకాలనీ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కేవలం రెండుగంటల్లోనే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే మూడు గంటల నుండి ఐదు గంట ల వరకు మరో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతా ల్లో ఇళ్లలోకి రెండు అడుగుల ఎత్తులో వర్షపునీరు ప్రవేశించడంతో ఆయా కాలనీవాసులు డాబాలపైకి చేరుకుని ప్రాణభయంతో తెల్లవార్లు కాలం గడిపారు. అయితే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై వర్షం తగ్గుముఖం పట్టగానే ఆయా ప్రాంతాల్లో కలియ తిరుగుతూ అవసరమైన చోట్ల ట్రెంచ్‌లు తవ్వించి నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేపట్టారు. ప్రధానంగా ఆర్టీసి బస్టాండ్, చీడికాడ రోడ్డు శ్మశానం వద్ద, అంకుపాలెం గోవిందమ్మకాలనీ వద్ద, గండికాలనీ తదితర ప్రాంతాల్లో జెసిబి యంత్రాల్లో ట్రెంచ్‌లు కొట్టించి వరదనీరు పోయేందుకు ఏర్పాట్లు చేసారు. అలాగే స్థానిక ప్రభుత్వ కళాశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి ముంపుప్రాంతాల వాసులను తరలించి భోజన సదుపాయాలను కల్పించారు. సుమారు 1900మందికి ఉదయం, మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటు చేసారు. రాత్రికి బాలగణపతి సంఘం తదితర స్వచ్చంద సంస్థలు, రెవెన్యూ యంత్రాంగం బాధితులకు ఆహార పొట్లాల పంపిణీకి సన్నద్ధమయ్యారు. ఈ వర్షం మూలంగా పూర్ణా థియేటర్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో వర్షపునీరు ప్రవేశించడంతో పలు దుకాణాల్లో వస్త్రాలు తడిసి ముద్దయ్యాయి. అలాగే పిఎసిఎస్ గోదాముల్లో ఉంచిన ఎరువుల బస్తాలు వర్షపునీటికి ధ్వంసమయ్యాయి. సుమారు 34బస్తాలు వర్షపునీటిలో తడిసిముద్దయినట్లు పిఎసిఎస్ అధ్యక్షులు బొడ్డపాటి లక్ష్మణరావు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చోడవరంలో వర్షబీభత్సం సృష్టించడంతో ప్రజాప్రతినిధులతోపాటు ఆర్డీవో పద్మావతి కూడా ఆయా కాలనీల్లో తిరుగుతూ బాధితులకు ధైర్యం చెప్పారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆమె భరోసా ఇచ్చారు.