S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైద్యాధికారిపై దాడిచేసి... చొక్కా చింపి...

కదిరి, సెప్టెంబర్ 25 : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వెళ్లిన డిసిహెచ్‌ఎస్ (జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి) డాక్టర్ రమేశ్‌నాథ్‌పై సిపిఐ నాయకులు నడిరోడ్డుపైనే దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటుచేసుకుంది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో డిసిహెచ్‌ఎస్ రమేశ్ ముందుగానే కదిరి ఆసుపత్రికి వెళ్లారు. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలుతున్నా వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆగ్రహంతో సిపిఐ నాయకులు, కార్యకర్తలు జాయింట్ కమిషనర్ పర్యటనను అడ్డుకునేందుకు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అప్పటికే ఆస్పత్రికి వచ్చి ఉన్న రమేశ్‌ను వారు అడ్డుకున్నారు. వారిలో కొందరు రమేశ్‌పై దాడి చేసి చొక్కా చింపివేశారు. ఈ దాడికి నిరసనగా వైద్యసిబ్బంది ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అయితే కదిరి ఆర్డీఓ వెంకటేసు దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి జిల్లా వైద్యాధికారిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆసుపత్రికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. కాగా దాడిని జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరబాబు ఖండించారు.

చిత్రం..అనంతపురం జిల్లా కదిరిలో సిపిఐ నేతల దాడిలో
డిసిహెచ్‌ఎస్ రమేష్‌నాథ్ చొక్కా చిరిగిపోయిన దృశ్యం