S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రకాశం బ్యారేజీకి తగ్గుముఖం పట్టిన వరద

విజయవాడ, సెప్టెంబర్ 25: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజీకి క్రమేణా వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. అయితే నాలుగోరోజైన ఆదివారం కూడా మొత్తం 70గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. రాత్రి 7గంటల సమయానికి మొత్తం గేట్లను రెండు అడుగులమేర పైకి ఎత్తి లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం పులిచింతల, ఇతర వాగుల నుంచి కేవలం 80వేల క్యూసెక్కులు మాత్రమే బ్యారేజీకి చేరుతోంది. వరదను దృష్టిలో పెట్టుకుని తొలుత బ్యారేజీ నీటిమట్టాన్ని క్రమేణా తగిస్తూ వచ్చి ప్రస్తుతం వచ్చిన నీటిని నిల్వ చేయటం ప్రారంభించారు. ఏడాది పొడుగునా నీటిమట్టం 12 అడుగులు ఉండాల్సి వుండగా ప్రస్తుతం 11 అడుగులకు చేరింది. నాలుగు రోజుల క్రితమే పట్టిసీమ మోటార్లను కట్టివేయటంతో ప్రస్తుతం వరదనీరు కేవలం 260 క్యూసెక్కులు మాత్రమే బ్యారేజీకి చేరింది.

చిత్రం..ప్రకాశం బ్యారేజీ నుండి విడుదలవుతున్న వరద నీరు