S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గరిష్ఠస్థాయకి శ్రీశైలం జలాశయం

కర్నూలు, సెప్టెంబర్ 25: కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 879.7 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటి నిల్వ 215.8 టిఎంసిలకు గానూ 185.85 టిఎంసిలకు చేరుకుంది. ఎగువన జూరాల నుంచి జలాశయానికి 1.96 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోని 7, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలోని 3 జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 69వేల క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీటి మట్టం మరో 4 అడుగుల మేర చేరితే ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని గేట్లు ఎత్తే విషయంపై మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చిత్రం.. శ్రీశైలం జలాశయంలో గరిష్ఠస్థాయికి చేరిన నీటిమట్టం