S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అష్టదిగ్బంధంలో గద్వాల

గద్వాల, సెప్టెంబర్ 25: నడిగడ్డ అష్టదిగ్బంధం... పోలీసుల పహారాలో దిగ్బంధమైంది. పట్టణమంతా ఆగ్రహ జ్వాలలతో ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి ప్రభుత్వంపై దండయాత్ర చేపట్టారు. జెఎసి ఆధ్వర్యంలో మూడు రోజుల బంద్ విజయవంతమైంది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించి రోడ్లపై ఉద్యమకారులు జిల్లా ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. పట్టణంలోని అయిజ, రాయచూరు, కర్నూలు ప్రధాన రహదారులలో రోడ్లకు ఇరువైపులా భారీ మొద్దులు, ఇనుపకంచె, ముళ్లపొదలను అడ్డంగా వేసి ధర్నా చేపట్టారు. జెఎసి పిలుపు మేరకు అన్ని పార్టీల నేతలు రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గద్వాల మాజీ మంత్రి, ఎమ్మెల్యే డికె అరుణ ధర్నాలో మాట్లాడారు. అలంపూర్, గద్వాల ప్రాంత ఎమ్మెల్యేలు గద్వాల జిల్లా కావాలని గత పద్దెనిమిది నెలలుగా నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు.
వందేళ్ల చరిత్ర గల నడిగడ్డపై ఎంద రో దండయాత్ర చేపట్టిన విజయం సాధించిన గడ్డ అని గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ జిల్లాల విభజనలో కళ్లకు గంతలు కట్టుకొని జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని, ఒక రాజకీయ నాయకుడి మెప్పుకోసం నడిగడ్డకు ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాలను జిల్లాగా ఎందుకు వద్దో ముఖ్యమంత్రి ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. శాంతియుతంగా చేపట్టిన దీక్షలు, ధర్నాలకు ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ప్రజలను, ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. నడిగడ్డ నుంచే గతంలో పాదయాత్ర చేపట్టి పీఠాన్ని కైవసం చేసుకున్నావని, ఆ కృతజ్ఞత చూపకపోవడం ఈ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ప్రజలు తరిమే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు.

చిత్రం.. కర్నూలు రహదారిపై రోడ్డు దిగ్బంధం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేడికె అరుణ