S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైద్యశాఖ అప్రమత్తం

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆసాధారణంగా వర్షాలు కురుస్తున్నందున వైద్య శాఖను అప్రమత్తం చేసినట్టు, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. జిల్లాల వారిగా డిఎంహెచ్‌ఓలు సమీక్షలు చేస్తున్నారు. వర్ష తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలవారీగా దానికి తగ్గట్టు సిద్ధమవుతున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వైద్య సహాయంపై అధికారులు చర్చించారు. మందులు, డాక్టర్లు, 104 వాహనాలు సిద్ధంగా ఉంచినట్టు, అవసరమైనచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వర్షాల తరువాత జిహెచ్‌ఎంసి పరిధిలోనే నీరు నిలిచి, దోమలు పెరిగి అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య విభాగం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో అత్యవసరం కోసం 17 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. రంగారెడ్డి జిల్లాకు మెదక్ నుంచి ఆరు అంబులెన్స్‌లు తెప్పించారు. మెదక్ నుంచి మరో మూడు, నల్లగొండ నుంచి ఏడు అంబులెన్స్‌లు నగరానికి తెప్పించారు. హైదరాబాద్‌లోని వివిధ క్యాంపుల్లో వందమంది డాక్టర్లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 14,800 మందికి పరీక్షలు నిర్వహించారు. ఉస్మానియా, గాంధీలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. నగరంలోని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులు ఉస్మానియా, గాంధీ వైద్య శాలల్లో అలర్ట్ ప్రకటించారు. ఓపిని రెండు గంటల పాటు పెంచారు. ఎమర్జన్సీ వార్డులను, పరికరాలను సిద్ధంగా ఉంచారు.