S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎస్సారెస్పీ నుండి వరదనీటి విడుదల

బాల్కొండ, సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతం నుండి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 42 వరదగేట్లను ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మహారాష్టల్రోని విష్ణుపురి, గైక్వాడ్, ఆవ్రే డ్ డ్యామ్‌లతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా 4లక్షల 43వేల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో 1091.00అడుగలు 90టిఎంసిల సామర్థ్యం గల రిజర్వాయర్‌లో 1090.00అడుగులు 84.18 వద్ద నీటిని నిల్వ ఉంచుతూ వచ్చిన వరదనీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. వరదకాల్వ ద్వారా 15వేల క్యూసెక్కులు, లక్ష్మికాల్వ ద్వారా 150క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

చిత్రాలు.. ఎస్సారెస్పీ ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వదులుతున్న మిగులు జలాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సారెస్పీ ప్రాజెక్టు అందాలను వీక్షిస్తున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి