S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారీ వర్షాలపై అప్రమత్తం

సిద్దిపేట, సెప్టెంబర్ 25 : భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో జెసి వెంకట్రామ్‌రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్టు, అధికారులతో భారీ వర్షాలు, వరదలు, సహయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ మరోరెండురోజులు భారీ వర్షాలు కరియనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రం అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం తీవ్రత తగ్గేవరకు అధికారులకు సెలవులు మంజూరు చేయవద్దని జెసికి సూచించారు. వర్షాం రాత్రి పూట పడుతున్న నేపథ్యంతో జిల్లాలో బుంగలు పడ్డ చెరువులు, వర్షాలు పడితే గండిపడే ప్రమాదం ఉన్నందున రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహాయంతో చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు వద్ద ఇసుక బస్తాలు సైతం సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు.
అలాగే ఆస్తి, ప్రాణ నష్టం జరుగుకుండ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంతో ఏలాంటి నష్టం జరుగుకుండ జిల్లా యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవటంపై అభినందించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వర్షం తగ్గిన వెంటనే పంట నష్టం అంచనా వేయాలన్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు అదనంగా నీరు వస్తుందని, అలాగే అప్పర్ మానేరు డ్యాం నిండిందని ఈ నేపథ్యంలో రబీ సీజన్‌లో వరిసాగు పెరుగనుందన్నారు. అందుకు అవసరమగు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయాధికారులను మంత్రి ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి సమీక్ష
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పురోగతిపై నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. అధికారులు ఓపిక, సహనంతో పనిచేయాలని సూచించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ సేకరణ పనులు,నియోజక వర్గం కాళేశ్వర ప్రాజెక్టు పురోగతిపై ఆరా తీశారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో కలసి పనిచేయాలన్నారు. అన్నిశాఖలకు సంబంధించిన అధికారులు అయా ప్రాజెక్టు పనులు పూర్తయ్యే వరకు అదనంగా సమయాన్ని కేటాయించాలని ఉద్యోగులకు మంత్రి కోరారు. ఈసమావేశంలో ఇరిగేషన్ సిఇ హరిరాం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ ఆనంద్ వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు