S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంత ప్రజలు

వరంగల్, సెప్టెంబర్ 25: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరిలో క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పరిస్ధితిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి కలెక్టర్‌ను అడిగితెలుసుకున్నారు. ముందస్తుగా గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. పరివాహక ప్రాంతాలలో మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతమైన ఓడగూడెం ప్రాంతాన్ని గోదావరి ముంపునకు గరికాకుండా మందస్తుగా ప్రజలను ఐటిడిఎ పిఓ అమొయ్‌కుమార్, ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ అప్రమత్తం చేశారు. ఇటీవల ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులలో వరద చేరడంతో వరదను భారీగా విడిచి పెట్టడంతో గోదావరి పొంగే ప్రమాదముండడంతో, మందస్తుగా లోతట్టు ప్రాంతవాసులను కలెక్టర్ ఆదేశాల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా 1, 10, 11 వార్డులకు చెందిన లోతట్టు ప్రాంతాల వాసులు ససేమిరా ఖాళీచేయబోమని మొండికేయడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా గోదావరి ముంపునకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సరక్షిత ప్రాంతాలలో ఇంటిస్థలాలు కేటాయించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఐటిడిఎ పిఓ, ములుగు ఆర్డీఓ, తహశీల్దార్, ఎస్సై నరేష్ లోతట్టు ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఇళ్ళను ఖాళీచేయబోమని మొండికేశారు. అయినప్పటికీ అధికారులు నచ్చచెప్పే ప్రయత్నంలో ఉన్నారు.