S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వద్దు.. వద్దు.. చైనా వద్దు

భారత భూభాగాలు ఆక్రమించి భారత్‌లో విప్లవ కారులకు, విధ్వంసాలకు సహాయం సహకారం అందించి భారత్‌కు ఎన్.ఎస్.బి.లో సభ్యత్వం వద్దు అని ప్రపంచ దేశాలకు చాటి, నిత్యం భారత్‌పై నిప్పులు రేపుతున్న శత్రుదేశమైన చైనాకు అమరావతి నిర్మాణంలో సాంకేతిక పరులకు అప్పగించి ఎర్ర చందనం ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకొన్న ఆంధ్ర సి.ఎం. పరిశ్రమ స్థాపనకు స్థలాలు ఇస్తామనడం శోచనీయం. అందుకే శత్రుదేశం మోసపూరిత సహకారం మాకు వద్దు వద్దు..
- సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ

డ్రైనేజీ వ్యవస్థను సరిచేయరా?
ఇటీవల కురిసిన వర్షాలకు నగరాలలోని రహదారులు నీటితో నిండిపోతున్నాయి. డ్రైనేజి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వలన మురుగంతా రోడ్లపైనే వుంటోంది. మున్సిపాలిటీ వారు పంపుల ద్వారా ఈ నీటిని తోడి కాల్వల గుండా పారిస్తున్నారు. విలువైన వర్షం నీరు ఈ విధంగా వృధా అవడం బాధాకరం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా గ్రామాలలో చాలావరకు ఇంకుడు గుంతలు తవ్వడం, చెరువులలో పూడిక వంటి చర్యలు చేపట్టి నీటిని నిల్వచేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, నగరాలలో ఫలితాలు నిరాశా జనకంగా వున్నాయి. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించి పట్టణాలు, నగరాలలో ప్రతీ ఇల్లు, అపార్ట్‌మెంట్‌కు విధిగా ఇంకుడు గుంతలు తవ్వించేలా నిబంధనలు రూపొందించాలి. అప్పుడే వర్షాభావ పరిస్థితుల్లో సైతం నీటి ఎద్దడిని నివారించుకోగలగడం సాధ్యం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

నిరుద్యోగులపై నిర్లక్ష్యం తగదు
ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంలో 26 నెలలుగా లక్షలాది నిరుద్యోగులకు ప్రభుత్వం కాస్త తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సుమారు 4వేల పైచిలుకు ఉద్యోగాలకు అనుమతి ఇచ్చింది. కానీ, ఎపిపిఎస్‌సిలో మొత్తం 9 సభ్యులు. ఒక ఛైర్మన్‌తో కల్సి పది మంది ఉండాల్సిన కార్యవర్గం నేడు ఇద్దరే ఉన్నారు. ఇంకా కనీసం అయదుగురు సభ్యుల నియామకం చేపట్టాల్సి వుంది. కానీ, కనీస సభ్యులు లేకుండా ఉద్యోగ ప్రకటనలు, నియామక ప్రక్రియ జరపొచ్చా? ఒక వేళ జరిపితే భవిష్యత్‌లో న్యాయపర సమస్యలు కచ్చితంగా ఉత్పన్నం కావా? అనే మీమాంస నిరుద్యోగుల్ని ఆందోళనకు గురిచేయగా సభ్యుల నియామకం చేయకుండా నియామక ప్రక్రియ చట్టబద్ధం కాదని, అది సదరు నిరుద్యోగుల హక్కుల్ని హరించటమే అవుతుందని మేధావుల అభిప్రాయం. ఎపి సీఎం చంద్రబాబునాయుడు తక్షణం ఎపిపిఎస్‌సిలో సమర్ధుల్ని సభ్యులుగా నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
- మూల శ్రీనివాసరావు, మల్లయ్యపేట

సెన్సార్ బోర్డు అడ్డుచెప్పదా?
రాను రాను చలనచిత్రాల పేర్లు, సన్నివేశాలు ప్రత్యక్షంగా బూతుల మయంతో నిండి సంఘ కట్టుబాట్లును తుంగలో తొక్కి వేయడం భారతీయ సంస్కృతి పరిధి దాటినట్లే కదా? ఇటీవల విడుదలైన ‘బంతిపూల జానకి’ స్టిల్స్ హీరో ఆకాష్, హీరోయన్ అసభ్య పోస్టర్ల గురించి నోటితో చెప్పక్కరలేదు. ఎంత హీనతకు జారిపోయిందో సభ్యత సంస్కారం లేని ఈ వాల్‌పోస్టర్లు పాఠశాలల, కార్యాలయాల గోడల మీద అంటించడం నేటి యువతీ యువకులు మైనర్ బాలబాలికలను ఆ చర్యకు పురిగొల్పటమే కదా? సెన్సార్ బోర్డువారు అడ్డుకట్టవేయకపోవడం విచారకరం.

ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌లను
ఉపయోగంలోకి తేవాలి
రహదారులపై నిత్యం ఎన్నో బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది తీవ్ర గాయాల పాలవుతున్నారు. ప్రథమ చికిత్స అందే లోపు వారి బాధ వర్ణనాతీతం. అతి తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలూ పోవచ్చు. మరి ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు నిరుపయోగంగా ఎందుకుంచుతున్నట్లు? ప్రమాదాలు జరిగే సందర్భాలలోనూ లేదా అనారోగ్యంగా ఉంటున్న ప్రయాణికుల దృష్ట్యా ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్‌ఎయిడ్ బాక్సుల్లో ప్రథమ చికిత్సకు సరిపడా మందులు ఉండాలి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని తక్షణం అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రథమ చికిత్స పెట్టెలలో తగినన్ని మందులు ఉంచాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
- కోవూరి వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు