S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీకు నేనున్నా!

గురజాల, సెప్టెంబర్ 25: వరదల వల్ల పంటనష్టపోయిన రైతులందరినీ ఆదుకుని రైతుల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల కురిసిన భారీవర్షాల వల్ల పట్టణంలోని గాడిదల వాగు సమీపంలో పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం సిఎం పరిశీలించారు. పంటనష్టం జరిగిన తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. పత్తి, మిరప మొక్కల వేర్లు కుళ్లిపోయి పెట్టుబడిని పూర్తిగా నష్టపోయామంటూ అన్నదాతలు గగ్గోలు పెట్టారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రెండు రోజుల్లో అధికారులతో పంటనష్టం వివరాలను సేకరించి నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చూస్తామన్నారు. మిరపనారు 50 శాతం సబ్సిడీపై అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. వరద వలన నష్టపోయిన ప్రతి కుటుంబానికి 20 కేజీల బియ్యం, కేజి కందిపప్పు, కేజి నూనె, ఇతర నిత్యావసర సామగ్రిని తక్షణం ఆయా ప్రాంతాల రేషన్ షాపు డీలర్ల ద్వారా పంపిణీ చేస్తామని సిఎం ప్రకటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న లిఫ్ట్ ఇరిగేషన్‌ల మరమ్మతులను ఆరు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. సాగునీరు అందించే పరిస్థితులు లేకపోవడం వలన మెట్ట పంటలు సాగు చేసుకోవాలని, గతంలో తాను ఎన్నోసార్లు చెప్పానని, కానీ వినకుండా రైతులు ఇబ్బంది పడి, తనను ఇబ్బంది పెడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. భారీ వర్షాల వలన వరదలు రావడంతో పల్నాడులో రోడ్లు, రైల్వేట్రాక్‌లు తీవ్రంగా కోతకు గురయ్యాయన్నారు. రైతులందరూ ఫసల్ బీమా, పంట బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించి అన్నిరకాల సమాచారాలను సెల్‌ఫోన్‌ల ద్వారా తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శిద్దా రాఘవరావు తదితరులు హాజరయ్యారు.

చిత్రం.. పంటనష్టం గురించి రైతులను అడిగి తెలుసుకుంటున్న సిఎం