S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమాచార హక్కు ప్రజలకు ఓ ఆయుధం

చార్మినార్, సెప్టెంబర్ 25: సమాచార హక్కు ప్రజలకు ఓ ఆయుధం లాంటిదని, దీనివల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సమాచార హక్కు వికాస సమితి ఆవిర్భావ సదస్సు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాచార హక్కుపై ప్రతి పల్లె, గ్రామాల్లో కూడా అవగాహన పెంపొందించాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వికాస సమితి ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరుడి వద్ధకు సంపూర్ణంగా చేరినపుడే సంపూర్ణంగా స్వాతంత్య్రం వచ్చినట్టు అని మహాత్మగాంధీ చేసిన వ్యాఖ్యను ఆయన గుర్తుచేశారు. సమాచార హక్కు అమల్లోకి వచ్చినప్పటి నుంచి యాభై శాతం అవినీతి తగ్గిందన్నారు. న్యాయవాదులు, జర్నలిస్టులు, విద్యావంతులు, ఉద్యోగులు ఈ హక్కును ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో సమాచారం హక్కు కోసం పిటిషన్ పెట్టుకునే వారిపై దాడులు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ హక్కు వల్ల ప్రజలకు సమాచారమే గాక, అధికారులకు గౌరవం కూడా దక్కుతుందన్నారు. ఈ హక్కును అధికారులను ఇబ్బందులకు గురి చేసేలా, బ్లాక్ మెయిల్ చేసేలా ఉపయోగించరాదని ఆయన సూచించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో వచ్చే నెల 6న పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పాత్రికేయులు కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు విద్యుత్, వ్యవసాయ సంబంధిత సమస్యలకు సంబంధించిన ఎంతో కీలకమైన సమాచారం ఈ హక్కు ద్వారా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఈ చట్టం ద్వారా ఎన్నో అక్రమాలను వెలికి తీయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. సమాచార హక్కు కమిషనర్ పదవీ కేవలం ఐఏఎస్, ఐపిఎస్‌లకే పరిమితం చేయకుండా న్యాయనిపుణులు, న్యాయవాదులకు సైతం ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సభాధ్యక్షుడిగా వికాస సమితి గౌరవ అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్తా వ్యవహారించిన ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది ఎస్. భరత్‌కుమార్, సమితి వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదెపాక మధుకుమార్, రాష్ట్ర కోశాధికారి వంగూరి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.