S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమస్య పూర్తయ్యే వరకు అన్ని శాఖల అండదండలు

జీడిమెట్ల, సెప్టెంబర్ 25: సమస్య పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు కాలనీలో ఉండి అండదండలు ఉంటాయని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట్ గ్రామం, బండారి లేఅవుట్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్‌తో కలిసి మంత్రి పర్యటించారు. కాలనీలోని బాదితులను పరామర్శించి సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల సహాయక చర్యల గురించి బాదితులను అడిగి ఆరా తీశారు. అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లలో వరద నీటిని సాధ్యమైనంత త్వరగా మళ్లించాలని బాదితులు మంత్రిని కోరారు. కాలనీలోకి చెరువు నుండి వచ్చే అలుగును మూసివేస్తే నీటి వరద తగ్గుతుందని బాదితులు కోరగా అలా మూసివేస్తే చెరువు కట్ట తెగిపోతుందని, ప్రమాదం మరింత తీవ్రమవుతుందని మంత్రి, ఎమ్మెల్యేలు బాదితులకు సూచించారు. అనంతరం తుర్క చెరువును, అలుగును పరిశీలించారు.
మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల బాధితులకు అన్ని సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉండి సహాయక చర్యలు అందిస్తుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవడం మానవ సాధ్యం కాదని చెప్పారు. వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఆనకట్ట నిండడం వలన ఈ ప్రాంతం ముంపునకు గురైందని, శాశ్వత పరిష్కారం రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరు సమన్వయంతో వ్యవహరించాలని, అన్ని శాఖల అధికారులు చేస్తున్న సహాయ, సహకారాలను స్థానికులు సహకరించాలని సూచించారు.
సెల్లార్లలో నిండిన నీటిని ప్రభుత్వమే తోడేస్తుందని, పాడైన విద్యుత్ మీటర్‌లను ఉచితంగా మారుస్తామని మంత్రి హామీనిచ్చారు. బాధితులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండదండలు ఉంటాయని ఏమాత్రం భయపడవద్దని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బి.ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ ప్రమీల, ఎంపిటిసి చందు ముదిరాజ్, ఎండిఓ అరుణ, ఇవోపిఆర్‌డి జ్యోతి పాల్గొన్నారు.
బాధితులతో ఎమ్మెల్యే సమన్వయ సమావేశం
నిజాంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్ అన్ని శాఖల అధికారులు, బాధితులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను వివేక్ తెలుసుకున్నారు. వివేక్ మాట్లాడుతూ అధికారులు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జెసిబిలు, విద్యుత్ మోటార్‌లు, పైపులు, ఇసుక బస్తాలు వంటి సదుపాయాలను సత్వరమే సమకూర్చాలని సూచించారు.
పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు కాలనీలో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, ఎంపిడిఓ అరుణ పాల్గొన్నారు.