S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కదంబం..విశేషం

దేవతలకు ఇష్టమైనదిగా చెప్పుకునే కదంబ పుష్పం భారత ఉపఖండంలో కనిపిస్తుంది. సుమధురమైన వాసనతో, కాషాయవర్ణంతో గుండ్రంగా, ఆకర్షణీయంగా కన్పించే ఈ పుష్పం తేనెటీగలకు ప్రీతిపాత్రమైనది. వీటిలో ఉండే మకరందం వాటికి ఇష్టం. ఐదున్నర సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉండే ఈ పుష్పంలో ఫలదీకరణం తరువాత ఎనిమిదివేల విత్తనాలు ఏర్పడతాయి. రంగులు, అత్తరుల తయారీలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అన్నట్లు సీతాకోక చిలుకల్లో ‘బ్రష్ ఫుటెడ్ బటర్‌ఫ్లై’ జాతికి చెందిన గొంగళి పురుగులకు కదంబ ఆకులు ఎంతో ఇష్టమైనవి. ఆ జాతి ఎదుగుదల అంతా కదంబ వృక్షాలపైనే ఉంటుంది. ఈ చెట్ల ఆకులు పశువులకు మేతగాకూడా పనికొస్తుంది. కదంబ ఫలం పూర్తిగా పండిన తరువాత విడిపోయి గాలికి విత్తనాలు చెల్లాచెదురుగా వెదజల్లబడతాయి. ఇది ఔషధవృక్షంకూడా. ఆధ్యాత్మిక, పౌరాణిక ఇతిహాసాల్లో కదంబ వృక్షానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

ఎస్.కె.కె.రవళి