ఎక్కడైనా బావే!
Published Monday, 26 September 2016![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/27v9.jpg?itok=0BXQKTjg)
పవన్ కళ్యాణ్ సరసన చిన్న పాత్రైనా సరే నటించడమంటే హీరోయిన్లకు పండుగలాంటిదే. స్టార్ హీరో సరసన నటిస్తే అవకాశాలు మరిన్ని వస్తాయన్న ఆలోచనా ఉంటుంది. పవన్ సరసన హీరోయిన్గా కాకుండా మరదలుగా నటించిన ప్రణీతకు మంచి గుర్తింపే వచ్చింది. అలా ఇప్పుడు పవన్కళ్యాణ్ ‘కాటమరాయుడు’ చిత్రంలో సరికొత్త మరదలు ఎంట్రీ ఇవ్వబోతోంది. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న మానస హిమవర్ష ఇప్పుడు కాటమరాయుడు చిత్రంలో పవన్కళ్యాణ్ సరసన నటిస్తుండటం ఆనందాన్నిస్తోందని చెబుతోంది. అయినా పవన్కళ్యాణ్ ఎక్కడైనా తనకు బావేనని చెబుతోంది. ఆయన ఇష్టపడే అమ్మాయిగా ఈ చిత్రంలో తాను నటిస్తున్నానని, ఆయన ఇంట్లోనే వుంటూ ఆయననే ఆటపట్టించే పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంటానని అంటోంది. లంగావోణీలోనే నా పాత్రంతా సాగుతుందని కనుక బోలెడంత నవ్వులు ఈ చిత్రంలో ఉంటాయని, తప్పక గుర్తింపు వస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి కొత్త మరదలు వస్తోందన్నమాట!