S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రా.. రమ్మని

‘రా.. రమ్మని’ కవర్‌స్టోరీ కథనం ద్వారా టూరిజం విశేషాలు, పలు ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. దసరా సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉందీ కథనం. ఎడిటర్‌తో ముఖాముఖి మనలో మనం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. సిసింద్రీ చిన్నారులకు, పెద్దలకు ఎంతో నచ్చుతోంది. వారం వారం మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న ఆంధ్రభూమి ఆదివారం అనుబంధానికి ధన్యవాదాలు.
-నీలిమ సబ్బిశెట్టి (రాజానగరం, తూ.గో.జిల్లా)
బలమైన కోరిక
‘ఓ చిన్న మాట’ ‘సండే గీత’ ద్వారా ఎనె్నన్నో చక్కటి అంశాలను పునరావృతం చేసుకుంటున్నాం. ‘బలమైన కోరిక’ గురించి చాలా బాగా రాశారు. మనిషికి బలమైన కోరిక ఉంటే చనిపోయేటప్పుడు జీవి అలా కొట్టుకుంటుందని పెద్దలు అంటారు. ‘ఓ చిన్న మాట’లో టీమ్ లీడర్ కూడా కరెక్ట్‌గా రాశారు. గోల్డ్‌మెడల్ తీసుకున్న వారు కాలేజీలో పాఠాలు సరిగా చెప్పలేని సందర్భాలు తెలుసు. కాబట్టి ఏ పని అయినా మనసు పెట్టి చేయాలి. అవీ-ఇవీ చాలా వింతగా భయం గొల్పేవిగా ఉన్నాయి. అమ్మతో నేను కవిత బాగుంది. రామాయణం - మీరే డిటెక్టివ్ వెరైటీగా పిల్లల్లో ఉత్సాహాన్నీ, తెలుసుకోవాలన్న ఆసక్తినీ కలిగిస్తోంది. పిల్లలు రామాయణాన్ని ఈ విధంగానైనా చదివించాలన్న మీ ప్రయత్నం అర్థమైంది. భగత్‌సింగ్ సీరియల్ పుస్తక రూపంలో రావడం మా అదృష్టం. సిసింద్రీలో మంచి మనసు కథ చాలా బాగుంది. మనిషికి మనసు మంచిదైతే అంతకంటే కావల్సిందేముంటుంది?
-డి.వి.తులసి (రామవరప్పాడు)
ఉత్తమ మరణం
‘్భగత్‌సింగ్’ సీరియల్‌లో ఆఖరి అంకంలో ‘నీ వంటి బిడ్డను కన్నందుకు నేను గర్వపడుతున్నానురా.. ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునేదే ఉత్తమ మరణం’ మాటలు.. భగత్ సింగ్ తల్లి తన కుమారుడు ఉరికంబం ఎక్కబోతున్న తరుణంలో పడిన ఆవేదన కాదది. భావోద్వేగంతో కూడిన ఆనంద తరంగం. దేశసేవలో అసువులు బాసిన త్యాగధనుల గురించి దాశరథి రంగాచార్య ఇలా అన్నారు. ‘తిమిరంతో చేసిన ఘన సమరం అమరం’ భగత్‌సింగ్ అతని ఇద్దరు స్నేహితులు అమరులయ్యారు కాబట్టే నేటికీ వారిని తలచుకుంటున్నాం. వారి స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. వీరి శవాలను ఛిద్రం చేసిన తెల్లదొరల రాక్షసత్వాన్ని లోకానికి తెలియపరచినందుకు అభినందనలు. ఇక - ఇంకా వెయ్యి సంవత్సరాలు గడిచినా విశ్వాంతరాళంలోని రహస్యాలలో ఒక మిలియన్ భాగాన్ని కూడా మానవుడు కనిపెట్టలేడని ఐన్‌స్టీన్ చెప్పాడు. కొత్త టెలిస్కోప్‌లు వచ్చినప్పుడల్లా విశ్వంలో మరిన్ని పాలపుంతలున్నాయనే సంగతి బయటపడుతూనే ఉంది.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
అక్షర సత్యం
స్టార్ ప్లేయర్లు కాదు టీమ్ ప్లేయర్లు కావాలి. ఎక్కువ తెలివితేటలున్నవారు సమర్థ నాయకులు అవుతారన్న గ్యారంటీ లేదన్న ‘ఓ చిన్న మాట’ ప్రత్యక్షర సత్యం. మనం సంపాదించుకున్న కొంత మంచి పేరు నిలబెట్టుకోవడం అసలు సమస్య అని గోపాలంగారు అనడం కొంతవరకు నిజమే. కాని ఒకసారి కీర్తి అంటుకుంటే ఒక పట్టాన వదలదు అనేదీ నిజమే. స్వాతంత్య్ర సమరయోధులు, సమాజ సేవకులుగా ఘనకీర్తి పొందిన కొందరి తెర వెనుక నాటకాలు, మోసాలూ బయటపడినా ప్రజలు నమ్మలేదు. వారి కీర్తికి భంగం కలుగలేదు. ఇక గగుర్పొడిచే సెల్ఫీలు తీసుకోవడం ఒక థ్రిల్. నిజమే కాని ఆ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
అనుభవం
కొన్ని విషయాలు అనుభవం అయితేగాని విశ్వసించలేమంటూ ‘సండే గీత’లో చెప్పిన రెండు సంఘటనలు హృదయాన్ని కదిలించి వేశాయి. ఈసారి మనలో మనం అంటూ మీరు చెప్పిన సమాధానాలు భలేగా పేలాయి. ముఖ్యంగా - తమ్ముడు అన్నకు మంచి పేరు తెస్తాడు, మోసేవాళ్లుంటేనే గుర్తింపు, భ్రష్టు వ్యవస్థను అర్థం చేసుకొని లాభపడటంలో కాంగ్రెస్‌ని మించింది లేదు అనడం! కొత్తదనం వెదుక్కునే క్రమంలో తిక్కతిక్కగా ఉంది. ఎక్కడ మొదలుపెట్టానో ఏ పక్కకు వెళ్లానో చివరకు ఎక్కడ తేలానో అని గోపాలంగారి తికమక అలరించింది.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)