S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనామ అగస్త్యభ్రాత

అతని రాక
నా మనసుకొక ఊరట
అతను రాని రోజు
నా మదిలో వ్యాకుల మొలకలు మొలుస్తాయి
అతనితో నాకు ఏ బంధమూ లేదు.
ఐనా.. అతని కోసం
నా రెండు కన్నులు వెయ్యి కన్నులై ఎదురుచూస్తాయి
నా మనస్సు అతని త్రోవకేసి కాపుకాస్తుంది.
అతని తలపులో...
మరుభూమి దాటి సుమవనం చేరిన స్వాంతనం
అతని చిరునవ్వు దొంతర...
నా గుండె లోలోతున గతం పెట్టిన గాట్లపై
వీచిన శీతల తెమ్మెర లేపనం
అతని చూపులో.. అతని నడకలో
శతాధిక యోజనాలను లక్ష్యించి
అనంత దిగంతాలకు గమించే దీరతం
అతని ఆగమనం...
నా వ్యథాకులిత హృదయ ఫలకంపై
గీచిన భావ గీతిక.
అతని పలుకులో...
బ్రతుకు లేచిగుర్లు రాల్చిన
తప్త హృదుల ఆశల మోసులపై
నవ వసంతం పరుచుకుంటుంది.
అతని కరచాలన స్పర్శకు...
తనువు కాళ మాలిన్యం తొలగి
నిర్మల ధవళ వర్ణమవుతుంది.
అతడు సహజ్ర గజాల మనోబలోపేతుడు
తాత్వికతలో వైశ్విక నరుడు
గాథాగాథలపై సమతలం దర్శిస్తాడు.
మృతామృతాల మధ్య సమదృష్టి నిలుపుతాడు.
స్థిరాస్థిరాల మీద, నిమ్నోన్నతాలపైన
ఏకత్వం ఆపాదించి
పురోగమించే మహాపథ గామికుడు అతడు.
అతడు వచ్చిన ప్రతిసారి
నాలో నీటి వూటలా వూరిన
సంశయాలను సందేహాలను నిస్సందేహం చేస్తాడు.
నాతో ముచ్చటించి, చర్చించి, తర్కించి
అనుమాన ప్రమాణాలను, ప్రత్యక్ష ప్రమాణాలను
సత్ప్రమాణాలతో విశే్లషించి
నా మదిలో విస్తరించిన
సందిగ్ధాల మేఘాలను తరిమేస్తాడు.
అతని రాక కోసం...
నా ఇంటి గవాక్షం గుండా
చూపుల వర్షం కురిపిస్తాను
అతను రాని రోజు
నా గుండె బండై బరువెక్కుతుంది.
నాకు అతనొక ఆశ్చర్యకాంశం! అపురూప విషయం.
అమూల్య ఇతివృత్తం! అద్భుత రూపం!
అమోఘ దర్శనం! అప్రమేయ దీప్తివంతం!
అతనో అనామ అగస్త్య భ్రాత!
అజ్ఞాతం అతని అభిమతం
అందుకే అతని పేరు వాక్రుచ్చ లేదు!
*

-కాశీవరపు వెంకటసుబ్బయ్య 9849800389