చిన్న శునకం.. పెద్దమనసు
Published Saturday, 8 October 2016ప్రపంచంలో సేవలు అందించే అతి పొట్టి శునకంగా గిన్నిస్ రికార్డు సాధించిన ఈ చిట్టిపొట్టి కుక్క పేరు లూసీ. లండన్‌లోని యార్క్‌షైర్‌కు చెందిన ఈ పొట్టి శునకం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగులకు మానసికంగా వారిలో ఉత్సాహం నింపడానికి పనిచేస్తోంది. తరచూ హాస్పిటల్స్, నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లను సందర్శిస్తూ రోగుల వద్దకు వెళుతుంది. దీని ఆకారం, చేష్టలు చూసి వారు ఆనందం వ్యక్తం చేస్తూంటారు. అలా మానసికంగా వారిలో ఉల్లాసం నింపడమే దీని పని. ఇక్కడ కన్పిస్తున్న ఓ భారీ భైరవుడిపై లూసీ ఫోజిస్తోంది చూడండి. దాని హవా అలా ఉంది మరి.