S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ మళ్లీ నీకై

ఓసారి ఓ జానెడు
తీరుబాటు చేసుకోగలవా...
నా ఈ గుప్పెడు మాటల్ని నీ గుండెలోకి
ఒంపాలిగా మరి...
తుఫాను రాతిరి సముద్ర తీరంలా
వేల కిలోమీటర్ల వేగంతో
ఆలోచనలు పరుగెడుతోంటే...
అద్భుతాలు అగాధంలో దాగి
ఒక్కొక్కటిగా బయట పడ్డట్టు
నా మనసు లోతుల్లో
నీ జ్ఞాపకాలు
వరుసలు వరుసలుగా ఉండి
ఒక్కసారిగా తెగిన ముత్యాల హారంలోని
ముత్యాలు దొర్లి పరచుకున్నట్టు
మనో మైకంలో ప్రతి ఆలోచనలోనూ
దొర్లిపోతాయి
నీలోకి నా ఏకాంతపు విత్తుల్ని
విత్తేసి
అవి మోహనంగా మొలకెత్తడాన్ని
చూస్తుంటే
పచ్చికపై పచ్చదనం పరుగెడుతున్నట్టు
వెలుగు విరులు వికసిస్తున్నట్టుంటుంది
ఒక జీవితకాలపు అనుభూతుల్ని
బోన్సాయిలా చేసి నా ముంగిట్లో పాతేశావ్...
ప్రతిసారీ ఆ అనుభూతుల జడివానలో
తడిసి మురిసి
మళ్లీ మళ్లీ నీకై
కురుస్తూ నేను.

-కళ్యాణదుర్గం స్వర్ణలత 9848626114