S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాపులర్ స్టార్!

బాలీవుడ్‌లో ఎంతో కాలంగా విభిన్న పాత్రలు పోషిస్తూ అగ్ర నటులతో ఆడిపాడిన అందాలభామ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌లోనూ పాపులర్ స్టార్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది. తాజాగా ఓ అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పేజీపై దర్శనమిచ్చి అందర్నీ ఆశ్యర్య చకితుల్ని చేసింది. ‘హాలీవుడ్ రాయల్’ అంటూ సదరు పత్రిక ప్రియాంక గురించి వ్యాఖ్యానించడం విశేషం. బాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్నాక హాలీవుడ్ ప్రయాణం ఎలా అనిపిస్తోంది? అని ఈ బ్యూటీని కదిలిస్తే- ‘‘ ఎక్కడైనా నటనే కదా. కాకపోతే హాలీవుడ్ స్టయిల్ హాలీవుడ్‌ది.. బాలీవుడ్ స్టయిల్ బాలీవుడ్‌ది. కానీ నటులందరూ ఎవరి శైలిలో వారు నటిస్తారు. నేనూ అలాగే అలాగే చేస్తున్నా. అయితే హాలీవుడ్‌లో వస్తున్న పేరు ప్రఖ్యాతులు తాత్కాలికమేనని భావిస్తున్నాను. నేను ఎప్పటికీ బాలీవుడ్ స్టార్‌నని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతాను’’అంటూ చెప్పుకొచ్చింది. అలా గర్వపడటం వల్లే బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా మరిచిపోలేని స్థానాన్ని కైవసం చేసుకుంది.

-సమీర్