S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? (అక్టోబర్ 23 నుండి 29 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక వ్యవహారాలు మెరుగవుతాయి. ఖర్చులు చేయి దాటకుండా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు విస్తరింప జేసుకోవడానికి అనుకూలం. స్ర్తి, పురుషులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వస్తువులు, వస్త్రాలు కొత్తవి పొందే అవకాశాలున్నాయి. కీలక పత్రాలు భద్రపరచుకోండి. మతిమరుపు రాకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులు పోటీ పరీక్షలందు అప్రమత్తంగా ఉంటే మంచి ఫలితాలందుకుంటారు. ఇతరులతో గొడవలు వద్దు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. శుభకార్యాలు నెరవేరనున్నాయి. విందులు, సంఘ కార్యాలలో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన పైకం సమయానికి అందుతుంది. ఖర్చులు ఆలోచింపజేస్తాయి. కులాసాలకు, విలాసాలకు అధికంగా వ్యయం చేస్తారు. సన్నిహితులు మీ మార్గదర్శకత్వం మేరకు లబ్ధిని పొందుతారు. దంపతులు సఖ్యతతో మెలగాలి. వ్యవసాయంలో అనుకోని మార్పులుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉండేట్లు చూసుకోవాలి. మీ మాటలతో సఖ్యత నెలకొంటుంది. విద్య, వృత్తి, వ్యాపార, రియల్ ఎస్టేట్, జ్యుయలరీ రంగాల వారు మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఏకాగ్రత, నిగ్రహం అన్నింటా శుభం. స్ర్తిలు సామరస్య ధోరణి వహించి కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు అంచనాలకు అనుగుణంగా ఉంటాయి. అన్నింటా కష్టానికి, ఇష్టానికి ప్రతిఫలం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఇష్టులు చెప్పినవి ఆలోచించి నిర్ణయాత్మక ధోరణితో వ్యవహరించాలి. సహోద్యోగులతో సమస్యలకు అవకాశం లేకుండా ప్రవర్తించాలి. దంపతుల సంఘ సేవ చేస్తూ కూడా మాట పడవలసి వస్తుంది. పరిచయస్థుల రాకపోకలు ఆలోచింపజేసి తికమక పెడతాయి. వృత్తి, వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ప్రతిఫలాలకై ఎదురుచూడకండి. అవీ మంచికి దోహదం చేస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)
ఇరకాటంలో పడకుండా కార్యాలకు ప్రణాళికలు వేయండి. అనుకున్నవి సాధిస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు, ఆశీస్సులుంటాయి. వ్యవహార ఒప్పందాల్లో మెళకువలు అవసరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయం సునాయాసంగా రాదని గుర్తించండి. అందుకు అనుగుణంగా వర్తించండి. దంపతులు కలసి బృంద కార్యాలందు పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలకు అనుగుణంగా వాతావరణం మెరుగవుతుంది. రావలసిన పైకాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. రావలసిన వారు ఆలస్యంగా రానున్నారు. అన్నింటా పరిశీలన మేలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)
సింహ భాగం సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అదనపు ఆదాయం వున్నా ఖర్చులు సంతృప్తి నిస్తాయి. పరిచయాలు బలపడతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. పైకం తీసుకోవటంలో జాగ్రత్త అవసరం. సన్నిహితులకు ఉపయుక్త సమాచారాన్ని అందించనున్నారు. అన్ని వ్యవహారాలలో ఏకాగ్రత వహించాలి. వృత్తి, వ్యాపారాలు తృప్తికరం. ఉద్యోగులు, ఇతర రంగాల వారికి మెరుగైన కృషితో వృద్ధిని సాధిస్తారు. శుభకార్య చర్చలు ఫలప్రదం అవుతాయి. వినోద, ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)
మీ చేతలు, మాటల ద్వారా వ్యవహారాదులు సాగుతాయి. ప్రతిఫలం అన్నింటా తక్కువగా అందినా మెల్లగా విలువల వృద్ధి ఉంటుంది. ఆదాయ మార్గాలు ఇబ్బందికరంగా ఉంటాయి. సకాలంలో చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వండి. అధిక శ్రమతో కార్యసిద్ధి. స్ర్తిలు ఇతరుల సాయంతో పనులు చక్కదిద్దుకుంటారు. అవివాహితులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు వృత్తి కార్యకలాపాలలో నిరుత్సాహాన్ని విడనాడాలి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులకు సాయం అందిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)
వ్యవహారాలు పూర్తి చేస్తారు. సాంకేతిక లోపం వల్ల అనుకున్న పనులు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఖర్చులకు సరిపోను ఆదాయం అందుతుంది. అప్పు ముప్పు అని గమనించండి. వృత్తి వ్యవహారాలు ఊపందుకుంటాయి. కుటుంబ సభ్యులకు శుభ పరిణామాలుంటాయి. దంపతులు సౌఖ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. చెక్కుల విషయంలో జాగ్రత్త వహించాలి. అన్నింటా జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక కార్యాల్లో మెరుగైన ఫలితాలు అందుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)
అనుకున్న పనులు తేలిగ్గా పూర్తి చేస్తారు. అన్నింటా సంతృప్తి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దైవిక కార్యాలలో పాల్గొంటారు. మిత్రుల, బంధువుల ప్రమేయంతో శుభకార్యాలు నెరవేరుతాయి. అవగాహన పెంచుకోండి. అన్ని పనులు మీరే చేయగలనని అనుకోకుండా నమ్మదగ్గ వారికి మీ పర్యవేక్షణతో పనులు అప్పగించండి. వ్యాపార విస్తరణకు అనుకూలం. వల్లమాలిన అనురాగం కొన్నిసార్లు ఇబ్బందిని కలిగించవచ్చు. అన్నీ మీకే కావాలని మొండిగా వాదించవద్దు. ఇబ్బంది పడతారు. పరామర్శలకు వెళ్లవలసి వస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)
పైకం సర్దుబాటవుతుంది. ఆదాయం ఇతరులకు అందించకండి. కుటుంబానికే ఖర్చు చేయండి. కొత్త యత్నాలు అనుకూలిస్తాయి. మిత్రత్వం మేలు చేస్తుంది. దంపతులు అన్నింటా సహనం పాటించాలి. కోపతాపాలు అదుపు దాటకుండా జాగ్రత్త వహించాలి. పొదుపు ధనం అందుకుంటారు. ఆకతాయిల ఆటలు సాగనీయకండి. మీ ప్రణాళికలు మీకే కాక ఇష్టులకు కూడా సత్ఫలితాలనిస్తాయి. వృత్తి వ్యవహారాలు మెరుగవుతాయి. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలందుకుంటారు. అన్నింటా సమ దృష్టిని ఉంచండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)
ఆనందకరమైన వాతావరణంలో వ్యవహారాలు చేపట్టి పనులు పూర్తి చేస్తారు. మీ పనులు ఇతరులు వచ్చి చేస్తారనుకోవద్దు. నూతన వస్త్ర, వస్తు ప్రాప్తి. చేసే పనులు కొన్ని అస్తవ్యస్థంగా ఉంటాయి. మీ జీవితంలోని మరపురాని సంఘటనలను ఇష్టులతో పంచుకుంటారు. సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక యాత్రలు ప్రయోజనకారిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఇబ్బందులున్నప్పటికీ పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ప్రతిఫలాన్నిచ్చి సంతోషాన్ని కలిగిస్తాయి. అవివాహితులు అనుకూల వార్తలు వింటారు.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)
కుటుంబంలో వాడివేడి చర్చలు ఉంటాయి. ఆత్మీయతా భావాన్ని పెంపొందించుకోండి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ధనాన్ని ఇంధనంగా వాడాలి. నియంత్రణ మేలు. వ్యవహారాలు ఆలస్యంగానైనా పూర్తవుతాయి. సమస్యలను తెలివిగా దూరం చేసుకోవాలి. మోసాలను గుర్తించాలి. అవగాహన అన్నింటా మేలు చేస్తుంది. అన్ని విషయాల్లో ప్రశ్నార్థకంగా ఉండకండి. పెద్దల ఆశీస్సులుంటాయి. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)
మీన మేషాదులు లెక్కించకండి. ఉన్న లభ్య వనరులతోనే మీ పనులు పూర్తి చేసుకోవాలి. నిరుద్యోగులకు, చిరు ఉద్యోగులకు, చేతి వృత్తుల వారికి ఫలవంతమైన కాలం. ఆర్థికోన్నతికి, పదోన్నతికి అవకాశాలున్నాయి. మీరు నమ్ముకున్న విలువలే మిమ్మల్ని కాపాడుతాయి. కుటుంబం కోసం అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆశించినవి మెల్లగా పొందుతారు. అనవసర నిల్వలు వ్యాపారాలందు కూడదు. స్వయంకృషే మేలు. అన్నింటా ఏకాగ్రత వహించండి.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855