ఈ పూలు అక్కడే పూస్తాయి
Published Saturday, 22 October 2016గులాబీవర్ణంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పూలు ఓ పొద జాతికి చెందినవి. మాల్టా దేశంలోని ఒకటీఅరా దీవుల్లోని లైమ్‌స్టోన్ శిఖరాలపై మాత్రమే ఇవి కన్పిస్తాయి. మాల్టీస్ రాక్ ఫ్లవర్‌గా వీటిని పిలుస్తారు. 1973 నుంచి ఇది మాల్టా జాతీయ పుష్పంగా ఎంపికయ్యాయి. అయితే గుర్తు తెలియని ఓ చిమ్మెట లార్వా వీటి పండ్లపై దాడి చేస్తూండటంతో ఈ పొదలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ పూలమొక్కల సంరక్షణకు మాల్టా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తోంది.