S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బహిష్కరించుదాం..

యుద్ధం-
అదొక వింత పదార్థం
మనిషి మేధస్సులో సృష్టించిన
వర్తమానపు విలువల్ని
మనిషి చేతనే ధ్వంసం చేయిస్తుంది
మనిషి జీవన రథాన్ని
మరో మనిషి చేత కూలదోయిస్తుంది
విరిగిన అవయవాలు రోదిస్తూ
నెత్తుటి మడుగులో తేలుతుంటే
వినోదంగా తిలకిస్తూ
ఆకలి తీరినట్లు త్రేన్చుతుంది
యుద్ధాలెన్ని చూడలేదు
గత చరిత్ర మిగిల్చినదంతా
సమర శంఖాల్లోంచి కారిన నెత్తురేగా!
పాలకుల వికృత వాంఛలకు
ప్రజలు బలి కావడమేగా!
యుద్ధమంటే భూమి కోసమే
ఎవరి హద్దుల్ని వారు వీడి
మరొకరి నేలను
ఆక్రమించుకోవడమేమిటి?
రెండు దేశాల నడుమ నిప్పు రగిల్చి
ఏడు దశాబ్దాలుగా
మంటను గమనిస్తున్న తెల్లవాడు
ఫలితం కోసం ఆత్రపడుతున్నాడేమో!
వాడి లోచూపును గమనించాల్సి ఉంది
ఎవడి జీవితం వాళ్లని
యధేచ్ఛగా అనుభవించేందుకు
యుద్ధానికి
నిషిద్ధపు రంగు పులిమి
జాతి సమూహం చేత బహిష్కరించుదాం
ప్రపంచ మేధావుల్లారా
ఈ అక్షరం పిలుపును ఆలకించండి.
*

-ఎస్.ఆర్.పృథ్వి 9989223245