S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

పెండెం శ్రీధర్, సిద్దిపేట
16.10.2016 ఆదివారం సంచికలో గడులు నింపండి అని పదకొండు ఆంగ్ల పదములకు తెలుగులో అర్థములు తెలుపుతూ ‘నేటి పొదుపు రేపటి మదుపు’ అని వాక్యం తెలియజేశారు. 2వ పదం rough అంటే ‘కటినము’ అని రాశారు. కఠినమునకు బధులుగా కటినము అని సెలవిచ్చారు. ‘కఠినము’ ‘కటినము’ ఒకటేనా?
పిల్లలను ఇది తప్పుదారి పట్టించినట్లు కాదా?
అది శుద్ధ తప్పు. రాసిన వాడి అజ్ఞానం వల్ల, మా అజాగ్రత్త వల్ల ఇది అచ్చులోకి వెళ్లింది. పొరపాటుకు సిగ్గుపడుతున్నాం. ఇక ముందు ఇలాంటివి కనపడితే తప్పక చెప్పండి.

కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు, ప్రకాశం జిల్లా
‘ఊరికి వెళ్లగానే ఉత్తరం రాయి. మరచిపోవద్దు’ అని ఆనాటి మాట! కాని నేడు ‘ఒక మిస్డ్ కాల్ ఇవ్వు. ఓ రింగ్ ఇవ్వు’ అనే అలవాటు. మార్పు బాధగా వున్నదా? లేదా?
ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. ఆత్మీయంగా ఉత్తరాలు రాసుకునే అలవాటు పోయినందుకు మాత్రం చింతించాల్సిందే.

పున్నావఝల వెంకటేశ్వరరావు, గుంటూరు
మన ప్రధాని నరేంద్ర మోదీ తన బాల్యంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ప్రముఖ స్వయం సేవక్ అని విన్నాను. అంతేకాదు, కేంద్రంలో చాలామంది మంత్రులు స్వయం సేవకులే. కాని, రెండున్నర సంవత్సరాలు గడచినా, సంఘం ఆశయాలు, సిద్ధాంతాలు ఆచరణలోకి వచ్చినట్లుగా కనపడదు. ఎందుచేత? మీ అభిప్రాయం ఏమిటి?
ప్రభుత్వం వల్ల కావలసిన పనులు అంటూ ‘సంఘ్’కి ఏమీ ఉండవు. దాని పని వేరు. పరిధి వేరు.

ఎం.కనకదుర్గ, తెనాలి
విశ్వ మానవ ప్రేమ, పరమత సహనం, మానవ విలువలే పట్టుగొమ్మలుగా వున్న హిందూ మతంపై దాడి పెరుగుతోంది. వివిధ ఛానెళ్లలో ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకారులు చెప్పే విషయాలపై కొన్ని ఛానళ్లు అదే పనిగా విమర్శించడం, వారి వ్యాఖ్యలపై చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారి వ్యాఖ్యల వలన దేశంలో సెక్యులరిజానికి పెనుముప్పు ఏర్పడుతోందన్న అభిప్రాయం బలపడే విధంగా ప్రవర్తిస్తున్నాయి. ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని, అదే పనిగా లోపాలు వెతికి పట్టుకొని విమర్శించడం ఏ విధంగా సెక్యులరిజం అవుతుంది?
కాదు. అది ‘పెక్యులరిజం’. హిందువుల చేతకానితనం దానికి కారణం.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
వచ్చే పదేళ్లలో దేశం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఐరాస ఇటీవల తీవ్ర హెచ్చరికలు చేసింది. మన ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకుండా, సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల్ని సైతం పరిశ్రమలు, సెజ్‌లు, రాజధాని, పవర్ ప్లాంట్‌లంటూ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం ఆత్మహత్యా సదృశం కాదా? అన్నపూర్ణగా పేరుగాంచిన మన దేశం తిండి గింజలకు సైతం భవిష్యత్తులో దిగుమతులపై ఆధారపడాల్సిందేనా?
అంతే మరి.

ఎన్.ఆర్.లక్ష్మి, సికిందరాబాద్
తెలంగాణా రాష్ట్రానికి ముప్పై ఒక్క జిల్లాలు అవసరమంటారా?
లేదు.

అలాగే నవ్యాంధ్రప్రదేశ్‌లోని పదమూడు జిల్లాలను కనీసం ఇరవై ఆరు చేస్తే పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుందేమో కదా?
10 కాస్తా 31 అయినపుడు 13 కనీసం 40 కావాలి.

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
గాంధీజీ జయంతి అక్టోబర్ 2, అలాగే లాల్‌బహదూర్ శాస్ర్తీ జన్మదినం అక్టోబర్ 2, గాంధీజీకి ఇచ్చినంత ప్రాధాన్యత శాస్ర్తీకి ఇవ్వటం లేదు. ఎందుకని?
లాల్‌బహదూర్ పేరు తలిస్తే తాష్కెంట్‌లో ఆయన అనుమానాస్పద మరణం గుర్తుకొస్తుంది. లేనిపోని ప్రశ్నలూ పొడుచుకొస్తాయి. కాబట్టి ఆయనను తలవనివ్వకపోవటమే తమకు క్షేమమని కాంగ్రెసు మారాజులు, మారాణులు అనుకుని ఉండవచ్చు. తరాలు మారేసరికి అలాంటి మహానాయకుడొకడు ఉన్నాడన్న సంగతే క్రమేణా మరపున పడింది. ఇలాంటి దుర్మార్గాలు మన దేశంలో చాలా జరిగాయి.

విజయరావు పోలవరపు, నెల్లూరు
మన పూర్వ ప్రధాని ఆడంబరాలు లేని మహామనీషి, అరుదైన నాయకులు కీ.శే.లాల్ బహదూర్ శాస్ర్తీగారి గురించి సవివరంగా ఓ రచన (వ్యాసం) రాసి ఈ తరానికి శాస్ర్తీగార్ని గురించి స్ఫూర్తిని ఇవ్వాలని మనవి.
ఎవరైనా రాసి పంపితే తప్పక వేస్తాం.

ఎ.ఎన్.ఆర్. పలాస
నేను ఈ మధ్యనే అమెరికా వెళ్లి వచ్చాను. అక్కడ నుండి వచ్చిన తరువాత మన రోడ్లు, నాలాలు, క్లీనింగ్, చెత్తాచెదారం చూస్తే అసహ్యంగా ఉంది. స్వచ్ఛ భారత్ పేరుకేగానీ ఎక్కడా అమలుకావడం లేదు. దానికి ఖర్చు మాత్రం ఎక్కువగానే కనపడుతోంది. ఏ ట్రైన్‌లో చూసినా టాయిలెట్స్ కంపుతో నిండి ఉంటున్నాయి. ఖర్చయితే అయింది గానీ ఇక్కడి వాళ్లని 10 రోజులు అమెరికా టూరిజం పేరుతో పంపితే మన ఊళ్లు, గ్రామాలు చక్కగా ఉంటాయి అనిపిస్తుంది.
పాపం! అమెరికా ఎఫెక్టు!!

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
అమెరికాలో ట్రంప్‌కు హిందువులు వత్తాసు పలుకుతున్నారు. హిల్లరీ నెగ్గడం నల్లేరు మీద బండి నడకంటున్నారు. హిల్లరీ ఇండియన్స్‌కు వ్యతిరేకం అవుతుందేమో?
కాదు.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com