S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డబుల్ కోకోనట్ అంటే తెలుసా?

ప్రపంచంలో అతిపెద్దదైన, బరువైన విత్తనంకల ఫలం..డబుల్ కోకోనట్. దానిరూపం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. దీనిని లుడేసియా, సీ కోకోనట్, కోకో డి మెర్ అని కూడా పిలుస్తారు. పామ్ జాతికి చెందిన ఈ కాయలు దాదాపు కొబ్బరికాయల్లాగానే కన్పిస్తాయి. కాకపోతే రెండు కలసినట్లుంటాయి. ఒకేవిత్తనం ఉండే ఈ ఫలం పైపీచు పోయిన తరువాత కన్పిస్తుంది. ఈ విత్తనం బరువు కనీసం 42 కేజీలు ఉంటుంది. దీనినిబట్టి అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. చెట్టు ఆకులు కాండం పైకొనలో ఫ్యాన్ మాదిరిగా ఉంటాయి. సీషెల్స్ దీవుల్లోని ప్రాస్లిన్, క్యురీసీ దీవుల్లో మాత్రమే ఇవి కన్పిస్తాయి. ఈ చెట్లు 14 ఏళ్ల వయసు వచ్చాక పూతపూస్తాయి. వీటి కాయ ఏడేళ్లకు పండుతుంది. నీళ్లలో రెండేళ్లపాటు నానితేగాని మొక్క మొలవదు. దీని విషేషాలు అన్నీ ఇలాంటి వింతలే.

ఎస్.కె.కె.రవళి