S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఈ నత్తలు శాకాహారులు!

ఔను...జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్‌గా పిలిచే ఈ రాకాసి నత్తలు ల్యాండ్ స్నెయిల్స్ జాతిలో అతిపెద్దవి. జీవితాంతం పెరుగుతూనే ఉండే ఇవి సగటున 20 సెంటీమీటర్లు పొడవున ఉంటాయి. దాదాపు 500 రకాల ఆకులు, పండ్లను ఇవి తింటాయి. చాలా రకాల నత్తలకు భిన్నంగా ఇవి కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటాయి. కొత్త ప్రాంతాల్లో వేగంగా ఇమిడిపోయే ఇవి వ్యవసాయదారులకు సింహస్వప్నం. ఎందుకంటే బాగా తిండిపోతులైన ఈ నత్తలు పంటలను ధ్వంసం చేస్తూ నష్టాలకు కారణమవుతూంటాయి. వీటిని చీడపీడల జాబితాలో చాలా ప్రభుత్వాలు చేర్చాయి. వీటిని పెంచుకోవడం అమెరికాలో నిషిద్ధం. రెండు జతల టెంటకిల్స్ ఉన్న వీటికి మొదటి జత టెంటకిల్స్ కొనల్లో కళ్లుంటాయి. రెండోజత వాసనను గ్రహిస్తాయి. వీటి నాలుక పొడవుగా రిబ్బన్‌లా (రాడ్యులా) మాదిరిగా ఉండి దానిపై ఇరువైపులా పళ్లున్నమాదిరిగా ఉంటుంది. ఆహారాన్ని తీసుకున్నప్పుడు వీటిమధ్య పడి అది చిన్నచిన్న ముక్కలుగా మారిపోతుందన్నమాట. తూర్పు ఆఫ్రికాలో ఎక్కువగా కన్పించే ఇవి ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.

ఎస్.కె.కె.రవళి