S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాలీవుడ్ క్వీన్!

ఎలాంటి గాడ్‌ఫాదరేకాదు.., సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఏమాత్రం లేని తారల్లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముందుంటుంది. ఎన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ చేసిన పాత్ర ద్వారానయితేనేమి.. వచ్చిన అవకాశాల ద్వారా అయితేనేమి నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆయా పాత్రల ద్వారానే బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. స్టార్‌గా ఎదగడం వెనక ఆమె చేసిన కృషి అంతా ఇంతాకాదంటారు ఆమె సన్నిహితులు. ఎంపిక చేసుకున్న క్యారెక్టర్స్ విషయంలో ఆమె తెలివితేటలు ఎంతగానో ఉపయోగపడ్డాయని కూడా చెబుతుంటారు. చాలా మంది అగ్ర కథానాయికలు బిగ్రేడ్ సినిమా అనగానే మొహం చాటేస్తుంటారు. వాటి నుంచి తప్పించుకు తిరుగుతుంటారు. కానీ అలాంటి చిత్రాల విషయంలో కంగనా ఏ మాత్రం వెనుకడుగువేయదు.. సరికదా ఆచి తూచి ఆ చిత్రం విషయంలో మరింత లోతుగా తెలుసుకుని తనకు లభించిన పాత్రకు న్యాయం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తుంటుంది. అలా చేయడం వల్లే బాలీవుడ్ క్వీన్‌గా గుర్తింపు లభించిందని కూడా చెబుతోంది. తన విజయ రహస్యం కూడా ఇలాంటి సినిమాల విషయంలో ముందుండటమేనంటోంది. దటీజ్..కంగనా!!

-సమీర్