S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేఘం ఉరిమింది

మేఘం ఉరిమింది
మెరుపు మెరిసింది
కురిసింది జడివాన
అడవి తల్లి గుండెల్లో
ఉప్పొంగిన వాగులు
అడవి బిడ్డలు జబ్బు బారిన
రవాణా మృగ్యం
వైద్యం దూరం
కావడి మంచంలో రోగుల మోత
సుదూర పయనం
నడక
సమయానికి చేరితే
ఊపిరి దక్కు
లేనిచో ప్రాణం పోయే
పసిబిడ్డకి జ్వరం
చేసిన నాటు వైద్యం పారలే
పాలిథిన్ సంచిలో బిడ్డ
తడవకుండా
బిడ్డ రక్షణ తండ్రి కర్తవ్యం
వసుదేవుడిని మించిన సాహసం
పీకల్లోతు వాగు నీటిలో
నెత్తిన బిడ్డ
వాగు లోతుపాతులు తండ్రికెరుక
అడుగు తీసి అడుగు
కడు జాగ్రత్తగా
నీటి ప్రవాహ అంచనాలో
తండ్రి సివిల్ ఇంజనీర్
బంధుమిత్రుల దీవెనలతో
వాగుని జయించి
ఆసుపత్రికి బిడ్డను చేర్చిన
తండ్రి
నాన్న పదానికే
సరికొత్త నిర్వచనమీ తండ్రి!!
పాలకుల అభివృద్ధి నినాదాల హోరుకి
సజీవ సాక్ష్యాలు
అడవి బిడ్డల ఆక్రందనలు *

-గిరిప్రసాద్ చెలమల్లు 9493388201