S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నానీలు

అన్యాయాన్ని సహించదు
న్యాయదేవత
అందుకే మరి
గంతలు కట్టుకుంది

బట్టలైనా మనసైనా
ఎండిపోయినట్టే
పూర్తిగా
తడారిపోయాక

కరెంటుంటే
కామన్ డిన్నర్
కట్టైతే
క్యాండిల్ లైట్ డిన్నర్!
లోకానికి
దృష్టి దోషం
ఖాకీలో వున్న
నిజాయితీ కనిపించదు.

ఒలింపిక్స్‌లో
పాల్గొంటుందేమో
పరుగులు తీస్తోంది
పెట్రోలు
దేవుడు
కొండెక్కాడు
కొండెక్కి పోలేదు
భక్తి!

-డేగల అనితాసూరి 9247500819