ఒక నది వొడ్డున కూచునీ..!
Published Saturday, 5 November 2016ఒక సాయంత్రం
ఎగురుతున్న సమయాల్ని
నది ఒడ్డున అలలతో
ముంచేశాను.
కాసేపు తుళ్లింత
గులకరాళ్లు పాడుతున్నాయి
కాసేపు కన్నీళ్లు
నదిలో పడవలై జారుతున్నాయి
ఒంటరి ఆనందం
రెక్కలు చాచి కౌగిలించుకుంది.
చల్లని గాలులు
ఎగిరే పక్షులు
నీట ముక్కలవుతున్న
చందమామలు
నన్ను ముంచుతున్నాయి
ఆకాశాన్ని గొడుగులా ఎక్కుపెట్టి
నాలో కలల కూజితాన్ని వినిపించాను
ఆ సాయంత్రం
జ్ఞాపకాలు
చేపల్లా ఎగురుతున్నాయి
నాలో
నిశ్శబ్ద ప్రవాహాలూ
పొంగుతున్నాయి.