S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్లూమార్లిన్ చేపల్లో ఆడవే పెద్దవి

అట్లాంటిక్ సముద్రజలాల్లో ఎక్కువగా కన్పించే బ్లూమార్లిన్ చేపలు సముద్రచేపల్లో అతిపెద్దవాటిలో ఒకరకం. బ్లూమార్లిన్ జాతి చేపల్లో మగవాటికన్నా ఆడవి మూడు, నాలుగురెట్లు పెద్దవిగా ఉంటాయి. పుట్టినప్పుడు ఒక్క మిల్లీమీటరు ఉండే ఈ చేపలు రోజుకు 16 ఎంఎంల చొప్పున పెరుగుతాయి. మూడు అడుగుల పొడవు వచ్చేసరికి మగవి జతకట్టేందుకు సిద్ధమవుతాయి. ఆడవి మాత్రం వయసుతో సంబంధం లేకుండా బరువుతో (265 పౌండ్లు) జతకట్టే సామర్థ్యాన్ని సాధిస్తాయి. కనీసం నాలుగు అడుగుల నుంచి 14 అడుగుల పొడవు పెరిగే ఈ చేపలు చేపల గుంపులు (స్కూల్)పై దాడి చేసి పొడవాటి ముక్కుతో వాటిని గాయపరచి, అవి మరణించాక తింటాయి. అతివేగంగా ఈదే చేపల్లో ఇవి కూడా ఒకటి. ఇవి ఏకంగా గంటకు 80 మైళ్ల వేగంతో ఈదుతాయి. రెండు రకాల షార్క్ చేపలు, మనుషులు వీటికి శత్రువులు. ఒక సీజన్‌లో నాలుగుసార్లు గుడ్లు పెట్టే ఈ చేపలు మొత్తంమీద 70 లక్షల గుడ్లు పెడతాయి.

ఎస్.కె.కె.రవళి