S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యుద్ధ నదిలో...!

వాళ్లు...
పోరు భూమిలో ప్రాణాల్ని
పచ్చ్భాస్వరంలా మండిస్తుంటారు!
సరిహద్దు రేఖ దాటి శత్రుమూకల మీద
సర్జికల్ అటాక్ చేస్తుంటారు!
దేశ దేహం కొరకు
తెల్లరక్త కణాలై పోరాడతారు!
గుండెనిండా దేశభక్తిని శ్వాసిస్తూ...
కత్తులు కట్టిన కోడిపుంజుల్లా
కదన భూమిలో లాంగ్‌మార్చ్ చేస్తుంటారు!
మువ్వనె్నల పతాకాన్ని భుజాన మోసుకొని
జాతిగీతమై సాగిపోతుంటారు!
కన్నీటి పొరల ఆవల
కదిలే బంధాల్ని దాచిపెట్టి
కళ్లను కాగడాలుజేసీ
సరిహద్దుల్ని కాపలా కాస్తుంటారు!
మరణాన్ని ధిక్కరిస్తూ...
యుద్ధనదిలో దేశాన్నొక
పసిపాపనుజేసి తీరం దాటిస్తారు!
మంటల గుడారం కింద
మృత్యువును కావలించుకొని
జాతిగుండెల్లో సదా జీవిస్తుంటారు!

-సిరికి స్వామినాయుడు 94940 10330