S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బౌన్సర్ దెబ్బకు వోగ్స్ విలవిల

పెర్త్, నవంబర్ 17: ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మన్ ఆడం వోగ్స్ ఇక్కడ షీఫీల్డ్ షీల్డ్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగిన అతనికి టాస్మానియా ఫాస్ట్ బౌలర్ కామ్ స్టీవెన్‌సన్ వేసిన బౌన్సర్ బలంగా తగిలింది. మెడ భాగంలో బంతి తగలడంతో విలవిల్లాడిన వోగ్స్ అక్కడే కుప్పకూలాడు. స్మృహతప్పి పడిపోయిన అతనికి వైద్య బృందం అత్యవసర సేవలను అందించి, ఆతర్వాత ఆసుపత్రికి తరలించింది. ఈ ఏడాది వోగ్స్ గాయపడడం ఇది రెండోసారి. మే మాసంలో ఇంగ్లీష్ కౌంటీ మిడిల్‌సెక్స్ తరఫున మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక ఫీల్డర్ వేసిన బంతి తగిలి వోగ్స్ స్పృహతప్పాడు. ఇలావుంటే, దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా స్పష్టం చేయలేదు.

చిత్రం.. బాధతో విలవిల్లాడుతున్న క్రిస్ వోగ్స్