S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నకిలీ రిజిస్ట్రేషన్లతో భూకబ్జా చేశారని...

గోదావరిఖని, నవంబర్ 17: గోదావరిఖని పట్ట ణం మార్కండేయ కాలనీ ప్రాంతంలోని పట్టా భూమిని నకిలీ రిజిస్ట్రేషన్లతో భూ కబ్జాలకు పాల్పడారని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్యతోపాటు మరో తొమ్మిది మందిని వన్‌టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. జనగామ శివారులో 676, 676 బిలోని 36 గుంటల భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి, జెసిబితో చదును చేసి కబ్జా చేశారని బాధితులు తాళ్లపలి కనకయ్య, వెంకటేశం, కొండపాక శంకర్, లింగాల రమణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరిపి ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్యతోపాటు గుంపుల ఓదెలు, జక్కుల రాజయ్య, గోపగాని సతీష్ గౌడ్, గోపగాని చంద్రమోహన్ గౌడ్, గొల్ల లక్ష్మిరాజం, ఎనగందుల వెంకటేశ్, మేడి శ్రీనివాస్, ఎలిగేటి శ్యాం, తాటిపాముల తిరుపతిని అరెస్ట్ చేసిన్నట్లు గోదావరిఖని వన్‌టౌన్ సిఐ ఆరె వెంకటేశ్వర్ తెలిపారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జక్కుల రాజయ్యకు సంబంధించిన వారసత్వపు భూమిగా నమ్మించి 2008 ఆగస్టులో దొంగ వారసత్వం ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఏడుగురు వ్యక్తులకు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించిన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే జక్కుల రాజయ్య అనే సదరు వ్యక్తి 30 ఏళ్ల క్రితమే మరణించగా అదే పేరుతో ఉన్న మరొకరిని వారసుడిగా సృష్టించి ఈ వ్యవహారానికి పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు. అయితే సదరు భూమికి సంబంధించిన కొనుగోలు దారులు 2001-05 వరకే ఈ భూములు కొనుగోలు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.