S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తూ.. జ్యూస్, బిస్కట్ల పంపిణీ

కరీంనగర్ టౌన్, నవంబర్ 17: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూ స్థానిక ఎస్‌బిహెచ్ ప్రధాన శాఖ, ఆంధ్రాబ్యాంకుల్లో క్యూలో నిల్చున్న వారికి భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి, యువ భారత్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పతంజలి జ్యూస్, బిస్కట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ భారత్ అధ్యక్షుడు ముత్యాల రమేష్ మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేయాలని గత ప్రభుత్వ హయాంలో 2011 సంవత్సరం నుండి స్వామి రాందేవ్ బాబా డిమాండ్ చేస్తూ వచ్చారని, దానికి అనుగుణంగా మోడి ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం హర్షనీయమన్నారు. ప్రజలు అధిక పన్నుల భారంతో జీవితాలను వెల్లదీస్తున్నారని, వాటిని కూడా తగ్గించాలని రాందేవ్‌బాబా డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మోడీ పరిణామాలు ప్రజలు త్వరలోనే అందుకోబోతున్నారని తెలిపారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఇలాంటి సమయంలో ఐక్యంగా ఉండి విచ్ఛిన్నరకరత శక్తులను పారద్రోలాలని పిలుపునిచ్చారు.