S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పనులు వేగవంతం చేయాలి

సిరిసిల్ల, నవంబర్ 17: ప్రాణ హిత చేవెళ్ళ ప్రాజెక్టు కింద చేపడుతున్న తొమ్మిదవ ప్యాకేజీ పనులను సత్వరంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి సిరిసిల్ల పొదుపు భవన్‌లో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు పడకల గుదులు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనులపై, అలాగే మంజూరైన రెండు గదుల గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో జడ్పి చైర్మన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాలల హక్కుల రక్షణలో...
ముకరంపుర (కరీంనగర్), నవంబర్ 17: బాలల హక్కుల సంరక్షణలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చారు. బాలలపై లైంగిక దాడులు, చట్టపరమైన చర్యలను వివరిస్తూ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా రూపొందించిన వాల్ పోస్టర్‌ను గురువారం కమలాసన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన బాలలపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అడిషనల్ సిపి అన్నపూర్ణ, జువైనల్ వెల్ఫేర్ డిపిఓ లక్ష్మిరాజం, ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ శృతి, కనుకయ్య పాల్గొన్నారు.