S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పావలా వడ్డీ విడుదల

సిరిసిల్ల, నవంబర్ 17: ఆడ పిల్లల బాకీ ఉంచుకోబోమని, మహిళలు ఎదిరి చూస్తున్న వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని, త్వరలోనే అవి మీఖాతాల్లో పడుతాయని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. గురువారం సిరిసిల్ల మండలం మండెపల్లిలో రూ.8 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి నాయిని ముఖ్య అతిధిగా పాల్గొనగా, అధ్యక్షత వహించిన కెటిఆర్ మాట్లాడుతూ అభయ హస్తం కూడా త్వరలో విడుదల అవుతుందని వెల్లడించారు. సిరిసిల్లలో త్వరలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలని, బీడు భూములన్నింటిని సస్యశ్యామం చేయడానికి కెసిఆర్ ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. ఈమేరకు మిడ్ మానేరు నుండి ఏగువ మానేరుకు ఎత్తిపోతల పథకం పనులు సాగుతున్నవని, రెండేళ్ళలో సిరిసిల్ల నేరెళ్ళ నియోజకవర్గాలలో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్టు తెలిపారు. కొత్త జిల్లా ఏర్పాటు అయ్యాక అన్ని రంగాలలో సాగు తాగు నీరు, సంక్షేమ రంగంలో నెంబర్ వన్‌గా ఉండాలని సిఎం కెసిఆర్ సారధ్యంలో ముందుకు సాగుతున్నట్టు వెల్లడించారు. 2018 వరకు ఇంటింటికి నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని కెసిఆర్ ప్రకటించాడని, దమ్మున్న సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.12 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రంను మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని 5400 పాఠశాలల్లో 3354 పాఠశాలల్లో డిజిటల్ బోధన విధానంను ప్రారంభించామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం రూ.200ల పెన్షన్లు ఇవ్వగా ఇపుడు వృద్దులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు పెంచామని, వికాలంగులకు రూ.1500 చేశామని, నాలుగు లక్షల మందికి రూ.40 కోట్ల పెన్షన్ ఇస్తున్నామని, దీనిపై ఏటా 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షమ రంగాలకు 35 వేల ఖర్చు చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో 65 ప్రభుత్వ, 225 ప్రైవేటు ఐటి ఐలుండగా, వీటిలో 47,372 మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అందుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రానికి కెసిఆర్ సిఎంగా రావడం, సిరిసిల్లకు కెటి ఆర్ ప్రాతినిథ్యం వహించడం ప్రజల అదృష్టమని, కెటిఆర్‌ను ప్రజలు వదులుకోవద్దన్నారు. కెసిఆర్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని, అందుకే అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. సమైక్య పాలనలో మనకు ఎలాంటి నిధులు అందకుండా చేశారని, అందుకే నీళ్ళు నిధులు, ఉద్యోగాల పేరిట ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, గతంలో మన నిధులు, ఉద్యోగాలు దొంగిలించుకపోయారని, ఇపుడు మన నిధులతో మనం అభివృద్ది సాధించుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రం వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. తన స్థాయి మరిచి రేవంత్‌రెడ్డి కెసిఆర్‌ను విమర్శిస్తున్నాడని, తెలంగాణలో ఆయనను ఆడ పడుచులే తరిమి కొడుతారని హెచ్చరించారు. గతంలో చెరవులు నాశనం చేశారని, తెలంగాణలో మిషన్ కాకతీయతో కలకల లాడుతున్నాయన్నారు. బిజెపి కూడా అడ్డగోలుగా విమర్శిస్తున్నదని, ప్రధాని ఏమి చేశాడో, ఇక్కడ కెసిఆర్ ఏమి చేశాడో చర్చకు సిద్దమా అని నాయిని ప్రశ్నించారు. అర్థంలేని విపక్షాల విమర్శలను పట్టించుకోవద్దని కోరాడు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ పి.సుధాకర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఎంపిపి కమలాబాయి, జడ్పిటిసి మంజుల, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఎఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.