గప్‌చుప్!
Published Friday, 18 November 2016సౌత్ బ్యూటీ నయనతార.. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పీకలోతు ప్రేమలో ఉందనే సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా.. ఆఖరికి విదేశాల్లో జరిగే అవార్డు ఫంక్షన్స్‌కు వెళ్లినపుడు కూడా విఘ్నేష్‌ను వెంట తీసుకెళ్లిపోవడం.. అక్కడ నయన్ చూసి ఈ దర్శకుడు మురిసిపోవడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా ప్రేమపక్షుల వ్యవహారం అనుకుంటున్నారు కానీ.. కొత్త పెళ్లి జంటగా పడుతున్నపాట్లు అనే టాక్ మొదలైపోయింది.
పెళ్లి జంట అంటే.. నయన్‌కి పెళ్లయిపోయిందా అనే డౌట్ రావడం సహజమే. అసలు విషయం అదే కదా. మే నెలలోనే అంటే ఆ నెలల ముందే విఘ్నేష్ శివన్‌తో నయనతారకు పెళ్లి జరిగిపోయిందని.. ప్రస్తుతం వాళ్లిద్దరూ భార్యాభర్తలే అని కోలీవుడ్ కోడై కూస్తోంది. ప్రేమ వ్యవహారం పాకాన పడగానే పెళ్లిపీటలు ఎక్కేశారట. గతంలో రెండుసార్లు లవ్‌స్టోరీలు ఫెయిల్ ఆయిన ఎక్స్పీరియన్స్ ఉన్న నయన్.. ఈసారి మాత్రం ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా పెళ్లితంతు ఫినిష్ చేసేసిందని అంటున్నారు. అక్కడినుంచే విఘ్నేష్ శివన్‌ను స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకుంటున్నారు. ఒకటి రెండు వర్కవుట్ అయ్యాయి కూడా. మరి ఇప్పుడు నయన్ చేస్తున్న సినిమాల స్పీడు చూస్తుంటే అసలు పెళ్లి సంగతి బయటకు చెబుతుందో.. ఎప్పటికీ చెప్పదో కూడా అర్థం కావడంలేదని అనిపిస్తోంది.