ఫైట్ చేస్తున్న డిజె
Published Friday, 18 November 2016అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథమ్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఈ ఫైట్ హైలెట్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలియజేసింది. బన్నీ నటించిన ‘సరైనోడు’ చిత్రం భారీ మాస్ హిట్ అవడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. దర్శకుడు హరీశ్ శంకర్ తనదైన స్టైల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని నిర్మాత తెలియజేశారు. డి.జె చిత్రం తప్పక విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.