S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కలెక్టర్ దండేకు రెడ్‌క్రాస్ అవార్డు

గుంటూరు, నవంబర్ 18: జిల్లాలో రెడ్‌క్రాస్ ద్వారా ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు కలెక్టర్ కాంతిలాల్ దండే రెడ్‌క్రాస్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ సర్వసభ్య సమావేశానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర శాఖ చైర్మన్ డాక్టర్ అంబటి లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో విశ్రాంత అధికారి రేచల్ ఛటర్జీ, ప్రధాన కార్యదర్శి ఎస్ బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 2012-13, 2013-14 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సురేష్‌కుమార్, 2014-15 సంవత్సరానికి గాను ప్రస్తుత కలెక్టర్ కాంతిలాల్ దండేలకు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ అవార్డు లభించింది. అవార్డు అందుకున్న వారిలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ వడ్లమాని రవి, కార్యదర్శి జివైఎన్ బాబు, ప్రముఖ ఆడిటర్ జి శివరామకృష్ణప్రసాద్, వాణిజ్యవేత్త షఫిక్‌ఖాన్ ఉన్నారు.