S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కృష్ణా రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కార్యాచరణ

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 18: విజయవాడ నగరంలోని కృష్ణా నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పర్చేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకూ ఉన్న నదీ తీరాన్ని రివర్ ఫ్రంట్ వ్యూలోకి తీసుకువచ్చి అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఆకర్షణీయ డిజైన్లు రూపొందించాలని అభివృద్ధి బాధ్యతలను అప్పగించిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అర్బన్ ప్లానర్ అండ్ ఆర్కిటెక్చర్ పి సురేష్‌బాబుతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన వీరపాండియన్ పలు సూచనలు చేశారు. ప్రకాశం బ్యారేజీ, శనైశ్చరస్వామి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే ట్రాక్ తదితర ప్రాంతాలను కలుపుతూ నదీ తీరాన్ని అందమైన ప్రాంతంగా అభివృద్ధి పర్చాలన్నారు. నదీ తీరానికి సమీపాన ఉన్న కనకదుర్గమ్మ దేవాలయానికి ఈ ప్రాంతానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, సందర్శకులు రాకపోకలు ఎక్కువగా ఉన్నందున తొలుత ఈ నదీ తీరాన్ని అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. నదీ తీరమే కాకుండా స్థానికంగా ఉన్న సబ్‌స్టేషన్, రాజీవ్ గాంధీ పార్కు, ఇతర వ్యాపార సముదాయాలను కూడా కలుపుకొని అందుకనుగుణంగా డిజైన్లను తయారుచేయాలన్నారు. సుందరమైన గ్రీనరీయే కాకుండా ఫిష్ అక్వేరియాలను కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ప్రముఖ టూరిజం స్పాట్‌గా కృష్ణా నదీ తీరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయ సహకారాలను విఎంసి నుంచి పూర్తి స్థాయిలో అందిస్తామని వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇఇ గోవిందరావు, ఉద్యానవన శాఖాధికారి ప్రదీప్‌కుమార్, అర్బన్ ప్లానర్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.