S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేఘనాకు తుది జట్టులో దక్కని చోటు

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 18: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన భారత్, వెస్టిండీస్ మహిళల మొదటి టి 20 మ్యాచ్ అద్యంతం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఐతే సొంత గ్రౌండ్‌లో ఆడుతుందనుకున్న మేఘనకు తుది జట్టులో మేఘన చోటు దక్కకపోవడంతో స్థానిక ప్రేక్షకులతో పాటు డిఎవి పబ్లిక్ స్కూల్ విద్యార్ధులు కొంత నిరాశ చెందారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కావడం, పైగా ఎటువంటి టికెట్ లేకపోవడంతో కళాశాలల విద్యార్థులతో పాటు ప్రజలు మ్యాచ్‌ను తిలకించేందుకు శుక్రవారం మైదానానికి చేరుకున్నారు. నగరానికి చెందిన మేఘన ఆడుతుందని తెలియడంతో మేఘన చదివిన కొండపల్లి డిఎవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని మ్యాచ్ ప్రారంభం నుండి డ్రామ్స్, బూరాలతో హోరెత్తించారు. గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకుని భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే కాకుండా వెస్టిండీస్ క్రికెటర్లను కూడా ఉత్సాహపర్చారు. భారత డాషింగ్ బ్యాట్స్ ఉమెన్ వేదాకృష్ణమూర్తి, వెస్టిండీస్ కెప్టెన్ టెలర్, డాటిన్ పేర్లను ఉచ్ఛరిస్తూ స్టేడియంలో మ్యాచ్ ఆద్యంతం కదలకుండా విక్షించారు. వేదా..వేదా.. కమాన్ ఇండియా.. కమన్ ఇండియా అనే నినాదాలతో స్టేడియం మార్మోగింది. వేదా సైతం అభిమానులకు అభివాదం చేస్తూ వారిని మరింత ఉత్సాహపరిచింది. అయినా భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిక్స్, ఫోర్ అంటూ సందడి చేశారు.