S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారత్‌కు చుక్కలు చూపించిన టేలర్

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 18: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ప్రారంభమైన టి 20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. వెస్టిండీస్ కెప్టెన్ టెలర్ 51 బంతుల్లో 90 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. భారత ఫీల్డర్ల, బౌలర్ల వైఫల్యాలను అందిపుచ్చుకుని భారత్‌ను చావుదెబ్బ కొట్టింది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్‌లో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. భారత జట్టులో రెండు మార్పులు చేశారు. కెరీర్‌లో మొదటి టి 20 ఆడే అవకాశాన్ని వికెట్‌కీపర్ పర్విన్, ప్రీతిబోస్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. తుది జట్టులో చోటు సాధించిన ప్రీతిబోస్ బౌలింగ్‌లో 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకుంది. వికెట్ కీపర్ పర్విన్ ప్రీతిబోస్ బౌలింగ్‌లో కూపర్‌ను స్టంప్ చేసి తన మొదటి స్టంపింగ్ నమోదు చేసుకుంది. బ్యాటింగ్‌లో వేదా కృష్ణామూర్తి 50 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. బౌలింగ్‌లో షీకాపాండే 3 వికెట్లు తీసుకుంది. 151 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. విండీస్ బ్యాటింగ్‌లో మాథ్యూస్ 18 పరుగులు, కూపర్ 16 పరుగులు, మెరిసా అక్వాలెరియా 15 పరుగులు, డాటిన్ 11 పరుగులు చేశారు. కెప్టెన్ టేలర్ 90 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.
స్కోర్ బోర్డ్
భారత్: వి వనిత ఎల్‌బి బి షకీరాసెల్మాన్ 3, స్మృతి మందానా బి డాటిన్ సి మెరిసా అక్వాలెరియా 11, వేదాకృష్ణామూర్తి బి షకీరాసెల్మాన్ సి క్యాసియానైట్ 50, హర్మన్ ప్రీత్‌కౌర్ 68 నాటౌట్, జులాన్‌గోస్వామి బి నేషన్ సి షకీరా సెల్మాన్ 11, అనూజపాటిల్ 0 నాటౌట్ (ఎక్స్‌ట్రాలు 7) 20 ఓవర్లలో 150/4.
వెస్టిండీస్ బౌలింగ్: షకీరా సెల్మాన్ 4-0-26-2, డాటిన్ 4-0-19-1, హిలీ మాథ్యూస్ 4-0-14-0, అనిసా మహ్మద్ 2-0-19-0, ఫ్లేచ్చర్ 2-0-26-0, నేషన్ 4-0-44-1.
వెస్టిండీస్ : హీలీ మాథ్యూస్ బి షీకా పాండె సి ఎక్తాబిస్త్ 18, టేలర్ బి షీకా పాండే 90, కూపర్ బి ప్రీతిబోస్ సి పర్వీన్ 16, మెరిసా అక్వాలెరియా బి షీకాపాండే సి వనిత 15, డాటిన్ 11 నాటౌట్, క్యాసియానైట్ 2 నాటౌట్ (ఎక్స్‌ట్రాలు 2) 19.1 ఓవర్లలో 154/4.
భారత బౌలింగ్ : జులాన్ గోస్వామి 4-0-29-0, షీకాపాండే 4-0-31-3, ఎక్తాబిస్త్ 2-0-16-0, అనూజ పాటిల్ 3.1-0-27-0, పూనమ్ యాదవ్ 2-0-19-0, ప్రీతిబోస్ 3-0-20-1, హర్మన్ ప్రీత్‌కౌర్ 1-0-12-0.